నా లెక్కలు నాకున్నాయ్‌: నయనతార

నయనతార అంటే ఒకప్పుడు గ్లామరస్‌ హీరోయిన్‌. అప్పుడూ ఇప్పుడూ ఆమె గ్లామర్‌కి లోటేమీ లేదు. కేవలం గ్లామరస్‌ పాత్రలే కాదు, 'శ్రీరామరాజ్యం' వంటి సినిమాలతో నటిగా మెప్పించింది కూడా. హీరోయిన్‌గా సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూసిన నయనతార, ఇప్పుడు చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. రెమ్యునరేషన్‌ విషయంలో అస్సలేమాత్రం రాజీ పడటంలేదు. డిమాండ్‌కి తగ్గట్టుగానే తన రెమ్యునరేషన్‌ వుందని నిర్మొహమాటంగా చెబుతోంది నయనతార. 

తమిళంలో ఇప్పుడు అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నది నయనతారే కావడం గమనార్హం. అయితే ఆమె పెద్ద హీరోలకు అందుబాటులో వుండడంలేదు. ఓ మోస్తరు సినిమాల చుట్టూనే నయనతార ప్రయాణం కొనసాగుతోంది. వీటిల్లో ఎక్కువగా హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌ కావడం మరో విశేషం. అలాంటి సినిమాలతో తనకు కంఫర్ట్‌గా వుంటుందని నయనతార చెప్పుకొచ్చింది. 

ఇక, తెలుగు సినిమాల్లో అస్సలేమాత్రం నటించడంలేదెందుకు.? అని ప్రశ్నిస్తే, 'మొన్ననే బాబు బంగారం సినిమా చేశాను కదా.. మళ్ళీ ఆఫర్‌ వస్తే ఆలోచిస్తా..' అని చెప్పిందిగానీ, ఆ సినిమా ప్రమోషన్‌లో నయనతార ఎక్కడా కన్పించలేదు. అదేమని అడిగితే, 'నా ప్రయారిటీస్‌ నాకున్నాయ్‌.. అన్ని విషయాలూ ముందే నిర్మాతకి చెప్పేస్తా.. కాబట్టి, అలా ఎందుకు చెయ్యలేదు, ఇలా ఎందుకు చెయ్యలేదు.. అనడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు' అని కసురుకుంది నయనతార. 

గ్లామర్‌ విషయంలో అయినా, రెమ్యునరేషన్‌ విషయంలో అయినా, కథల ఎంపికలో అయినా తన ఆలోచనలు తనకున్నాయనీ, ఈ విషయంలో ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నది నయనతార వాదన. మామూలుగా అయితే ఇలాంటోళ్ళని పక్కన పడేస్తారు సినీ రంగంలో. కానీ, నయనతార వెరీ వెరీ స్పెషల్‌. ఎందుకంటే, ఆమెకున్న క్రేజ్‌ అలాంటిది మరి.

Readmore!

Show comments