విశాఖలో బ్లాక్ హుష్ కాకి?

ఆంధ్రకు సంబంధించినంత వరకు బ్లాక్ మనీకి విజయవాడ,గుంటూరుతో సమానంగా విశాఖ కూడా పేరు సంపాదించింది. అధికార పార్టీకి చెందిన వారు అనేక మంది, ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో విశాఖలో వున్నారు. వీరి దగ్గర భారీగా పెద్ద నోట్లు వుండిపోయాయని వినికిడి. 

కానీ విజయవాడ, గుంటూరు మాదరిగా విశాఖలో ఎటువంటి కల్లోలం చెలరేగలేదు. అసలు గట్టిగా జనాల్లో ఏ వార్తలు, వదంతులు వినిపించలేదు. దీని వెనుక చాలా పకడ్బందీ కార్యక్రమాలే జరిగాయని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి.  విశాఖలో బలమైన రాజకీయ సంబంథాలున్న జ్యూయలరీ దుకాణాలు కొన్ని వున్నాయట. వీటి ద్వారా చాలా వరకు బ్లాక్ చేతులు మారిపోయిందని తెలుస్తోంది. అంతకన్నా ఇంకో కీలక వ్యవహారం చోటు చేసుకుందని తెలుస్తోంది. 

విశాఖలో రాజకీయ, వ్యాపార వర్గాలు తమ కోసమే ఏర్పాటు చేసుకున్న బ్యాంకులు ఒకటి రెండు, అలాగే రాజకీయ, వ్యాపార వర్గాల ఆధీనంలో ఒక బ్యాంక్ వున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూడింటిలో రెండింటిపై ఒక సామాజికవర్గానిదే పెత్తనం అని తెలుస్తోంది. అందువల్ల మొత్తం అంతా సైలెంట్ గా సమానంగా బ్లాక్ ను బ్యాంకుల చెస్ట్ ల ద్వారా మార్పిడి చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

వ్యక్తులు, మొత్తాలను ఓ ప్రో రేటా ప్రకారం, గడబిడ జరగకుండా సైలెంట్ గా బ్లాక్ ను చెస్ట్ లకు చేర్చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ వ్యాపార వర్గాలన్నింటికీ వర్కింగ్ క్యాపిటల్ ఆ బ్యాంకుల నుంచే సమకూరుతుంది. అవన్నీ అడ్జెస్ట్ మెంట్ చేసేసారని టాక్ వినిపిస్తోంది.  మొత్తం మీద తమ తమ వ్యాపార అవసరాల కోసం ఏర్పాటుచేసుకున్న బ్యాంకులు ఇప్పుడు ఫలితాలను ఇచ్చాయని హ్యాపీగా ఫీలవుతుతున్నాయట ఆయా సామాజిక వర్గాలు.

Show comments