అంధగాడు బాగున్నాడుగా

అంథత్వం అన్నది శాపం కాదు. కారాదు అన్నది ప్రతి వాళ్లు చెప్పే మాట. కానీ సినిమాకు సంబంధించినంత వరకు అంధత్వం సెంటిమెంట్ పాయింట్ నే కానీ, గ్లామర్ పాయింట్ కాదు. అందుకే అంథులు హీరోలుగా సినిమాలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఈ మధ్య ఈ పాయింట్ మీద చాలా మందే కన్నేసారు. 

అందరికన్నా ముందుగా రాజ్ తరుణ్-వెలిగొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా వచ్చేస్తోంది. అదే అంధగాడు. ఈ సినిమాలో తొలి నలభై నిమషాల పాటు హీరో కళ్లు లేకుండా వుంటాడు. సినిమా టీజర్ బయటకు వచ్చింది. ఎంటర్ టైన్ మెంట్ ను థ్రిల్లింగ్ సబ్జెక్ట్ తో మిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. మళ్లీ మరోసారి రాజ్ తరుణ్-హెబ్బా జంట క్లిక్ అయ్యేలా కనిపిస్తోంది. టీజర్ అంతా బాగుంది. కానీ ఒకటే వెలితి, హెబ్బా గొంతుతో తన స్టయిల్ ఫన్నీ డైలాగ్ ఒకటి పడి వుంటే మరింత సూపర్ గా వుండేది.

Show comments