డబ్బున్నవారి మమకారాలు కూడా కాస్ట్లీగా వుంటాయి. వంద చిత్రాల హీరో, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి వియ్యంకుడు, రాష్ట్ర మంత్రి మామగారు అంటేనే తెలుస్తుంది ఆ లెవెల్. అందుకే బాలయ్యకు కాస్ట్లీ బర్త్ డే గిఫ్ట్ అందించారట కుటుంబం సభ్యులు.
కోట్ల ఖరీదైన బెంట్లీ కారును తండ్రి బాలకృష్ణకు కూతుర్లు ఇద్దరూ కలిసి బహుమతిగా గిఫ్ట్ అందించారట. ఈసారి బాలయ్య పుట్టిన రోజు పోర్చుగల్ లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులంతా ఇక్కడి నుంచి అక్కడకు వెళ్లి మరీ బాలయ్యతో కలిసి ఆనందించారు. ఈ సందర్భంగానే ఈ బహుమతి అందించారట.
బాలయ్య తన పిల్లలకు వారసత్వంగా అందిస్తున్న ఆస్తి, దాంతో పాటు అందిస్తున్న ప్రేమానురాగాలతో పోల్చితే ఈ బహుమతి స్వల్పమే. కానీ కూతుళ్లు, అల్లుళ్లు అంత దూరం వెళ్లి, అభినందించి, కానుక అందించి రావడం మాత్రం విలువైన విషయమే బాలయ్యకు సంబంధించినంత వరకు.