బాహుబలి నుంచి రానాకు విముక్తి

బాహుబలి..ఇండియన్ సినిమా స్థాయిని చాలా విధాలుగా పెంచిన సినిమా. ఈ సినిమా కారణంగా మిగిలిన నటుల సంగతి ఎలా వున్నా, నాయక, ప్రతి నాయకులు ప్రభాస్, రానా చాలా ఏళ్లుగా అలా వుండిపోయారు. మధ్యలో రానా అయినా కాస్త అటు ఇటు వచ్చాడు కానీ ప్రభాస్ అక్కడే అలా ఫిక్స్ అయిపోయాడు. 

మొత్తానికి బాహుబలి 2 కూడా పూర్తయిపోయినట్లే. పాటలు, కాస్త ప్యాచ్ వర్క్ మిగిలింది. పాటలతో రానాకు పెద్దగా పని లేదు కాబట్టి ముందుగా విడుదలైపోయాడు. తన తరువాత సినిమాను అక్టోబర్ ఫస్ట్ నుంచి ప్రారంభించడానికి రెడీ అయిపోతున్నాడు. గెడ్డం గెటప్ ను తీసేస్తున్నాడు. 

ప్యాచ్ వర్క్ లో యువరాజు గెటప్ కాబట్టి, గెడ్డం అవసరం కూడా లేదట. తేజ దర్శకత్వంలో భరత్ నిర్మించే సినిమాలో రానా హీరొయిన్ కాజల్ తో కలిసి చేయబోతున్నాడు. మరో ఒకటి రెండు నెలల్లో బాహుబలి ప్రభాస్ కూడా బయటకు వచ్చి, ఎన్నాళ్ల నుంచో పెండింగ్ లో వున్న యువి క్రియేషన్స్-సుజిత్ సినిమాకు శ్రీకారం చుడతాడు.

Show comments