జేపీసార్ లేచొచ్చారు.. ఈ నినాదం ఆయనేదేనట!

లోక్ సత్తా మేధావి చాన్నాళ్లకు నిద్ర లేచారు. లేస్తూ లేస్తూనే.. “ప్రత్యేక హోదా నినాదం నాది..’’ అంటూ ఆయన నినదించారు. దీన్ని ఎవరెవరో హైజాక్ చేశారని జేపీగారి బాధ కాబోలు. ఈ నినాదంపై ఈ విధంగా ఆయన తన పేటెంట్ రైట్స్ ను  క్లైమ్ చేసుకుంటున్నారు. విభజనతో అన్యాయానికి గురవుతున్న ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రానికి మొదట చెప్పింది తనే అనేది జేపీ సార్ మాట.

అయినా ఈ మధ్య “నేనే.. నేనే..’’ అని చెప్పుకొంటున్న వాళ్ల పనే బాగుందని జేపీ సార్ భావించారేమో! అవతల చంద్రబాబు ఏమో ఏ పదం వినిపించినా, ఏం జరిగినా “దానికి కారణం నేనే..నేనే’’ అంటుంటే, రాని ప్రత్యేక హోదా విషయంలో జేపీ సార్ ఇదంతా నా క్రెడిటే అని అంటున్నారు!

అవతల “ప్రత్యేక హోదా’’ అంటూ జగన్ జనాల్లోకి వెళుతుండే సరికి ఇలా మాట్లాడుతుండటం, ఈ వాదనను కొన్ని పత్రికలు పతాక శీర్షికలకు ఎక్కించడం ఇదీ ఒక వ్యూహమే కావొచ్చు అనే అభిప్రాయాలను కలిగిస్తోంది. వెనుకటికి ఇలాంటి వ్యూహాలను అమలు పెట్టడంలో ‘ఒక వర్గం’ బాగా ఆరి తేరింది. ఒకవైపు ప్రత్యేక హోదా తో ప్రయోజనం శూన్యం అని ప్రచారం చేస్తూ, మరోవైపు ‘ప్రత్యేకహోదా’ డిమాండ్ నూ వినిపిస్తూ.. అన్ని పాత్రలనూ వేర్వేరు రూపాల్లో ప్రదర్శించడం ఆ వర్గానికి కొత్తేమీ కాదు. 

ఇప్పుడు ఉన్నట్టుండి జేపీ సార్ “అసలు ప్రత్యేకహోదా అనే మాటను వినిపించిందే నేను, దాన్ని కనిపెట్టిందే నేను’’ అంటుంటే ఏవో సందేహాలు కలుగుతున్నాయి. మరి హోదా నినాదం  ఎవరిది అనేది కాదు ఇక్కడ సమస్య… దాని కోసం ఎవరేం చేస్తున్నారు.. ఎవరు సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు.. అనేది జనాలకు అవసరం. జేపీ సార్ లాంటి మేధావికి అది తట్టడం లేదా?  Readmore!

Show comments

Related Stories :