పటాస్ అక్కడ పేలలేదు

కళ్యాణ్ రామ్ కెరీర్ లో మాంచి హిట్ గా నిలిచిన సినిమా పటాస్. ఆ సినిమాతోనే టాలీవుడ్ కు మరో మాంచి మాస్ డైరక్టర్ గా అనిల్ రావిపూడి దొరికాడు. అలాంటి పక్కా మాస్ మసాలా సినిమాను తీసుకెళ్లి లారెన్స్ హీరోగా తమిళంలో రీమేక్ చేస్తే, తుస్సుమని పోయింది. పేల్తుందేమో అనుకున్న ఈ సినిమా కనీసం సౌండ్ కూడా చేయలేదు.

ఈ సినిమా గురువారం నాడు తమిళనాట విడుదలయింది. కళ్యాణ్ రామ్ పాత్రను లారెన్స్, సాయి కుమార్ పాత్రను కట్టప్ప సత్యరాజ్ పోషించారు. మోట్ట శివ, కెట్ట శివ పేరుతో ఈ సినిమా రీమేక్ అయింది. తెలుగులో కృష్ణాష్టమి లాంటి డిజాస్టర్ లో నటించిన హీరోయిన్ నిక్కీ గల్రానీ నే ఈ తమిళ డిజాస్టర్ లో కూడా హీరోయిన్. లంగా ఓణీ వేసుకుని వీలయినంత చూపించినా పాపం ఫలితం దక్కలేదు. అన్నట్లు మన రాయ్ లక్ష్మీ ఈ లారెన్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

సాయికుమార్ పాత్రను అక్కడ తగ్గించేయడం, లారెన్స్ పాత్ర హడావుడి అన్నీ కలిసి ఈ తమిళ పటాస్ ను తుస్సుమనిపించేసాయి.అక్కడి వెబ్ సైట్లు అన్నీ ఎక్కువగా 1/5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం.

Show comments