ట్రెండింగ్స్ లో ఎన్టీఆర్, సల్మాన్, మణిరత్నంల పోటీ!

సినిమా హీరోలకు, రాజకీయ నేతలకు ఉన్న క్రేజేంటో చూపించుకోవాలంటే.. ఇంటర్నెట్ ట్రెండింగ్స్ లో ముందు ఉండటం కూడా నేటి రోజుల్లో తప్పనిసరి. ప్రత్యేకించి సినిమా హీరోల క్రేజ్ కు సోషల్ మీడియాపై వారి ప్రభావం కూడా ఒక ప్రామాణికం.

మరి ఈ విషయంలో తనేం తక్కువ కాదు అని నిరూపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈద్ సందర్భంగా ఈ హీరో తాజా సినిమా ‘జనతా గ్యారేజ్’ టీజర్ విడుదల నేపథ్యంలో ఎన్టీఆర్ సోషల్ మీడియా ట్రెండింగ్స్ లో సత్తా చాటాడు. ఫేస్ బుక్ ,  యూట్యూబ్ ట్రెండ్స్ లో ముందు నిలబడ్డాడు జూనియర్.

అయితే ఫేస్ బుక్ లో ఎన్టీఆర్ ఎక్కువ సేపు పోటీలో ఉండలేకపోయాడు. ఇదే హడావుడిలో మణిరత్నం సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావడంతో అది పూర్తి డ్యామినేషన్ చేసింది. ఎంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో అయినా ఇంటర్నెట్ లో మణిరత్నం ధాటిని తట్టుకోవడం కష్టమే అనే సంకేతాలను ఇచ్చింది “కాట్రువెలియిడై’ పోస్టర్. జనతా గ్యారేజ్ టీజర్ స్థాయిని దాటుతూ నిన్నటి ఫేస్ బుక్ ట్రెండింగ్స్ లో ఆ తమిళ సినిమా పోస్టర్ తొలి స్థానాన్ని ఆక్రమించింది.

ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ ట్రెండింగ్స్ లో ఉనికి చాటింది. విడుదలకు తర్వాతి రోజు కూడా సల్లూ సినిమా ఫేస్ బుక్ ట్రెండింగ్స్ లో నిలబడింది. మణిరత్నం సినిమా తర్వాతి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఈ మూడు సినిమాలూ ఫేస్ బుక్ ఇండియన్ ట్రెండ్స్  లో డౌన్ అయ్యాయి.

అయితే యూట్యూబ్ లో మాత్రం ఎన్టీఆర్ సత్తా చాటుతున్నాడు. విడుదల అయిన కొద్ది సేపటి కే యూట్యూబ్ ఇండియా ట్రెండ్స్ లో టాప్ కు చేరిన జనతా గ్యారేజ్ ఇప్పటికీ అదే స్థానంలో కొనసాగుతోంది. సోనాక్షి సిన్హా ‘అఖీరా’ టీజర్ ట్రెండింగ్స్ లో సెకెండ్ ప్లేస్ లో కొనసాగుతోంది. 

Show comments