ఇదంతా హిట్ లు లైక్ ల కోసమా?

చిరంజీవి 150 వ సినిమా హడావుడి ఓ రేంజ్ లో సాగుతోంది. ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించి, హైప్ ఓ లెవెల్లో చేసే ప్రయత్నం ప్రారంభమైంది. 22న చిరు బర్త్ డే సందర్భంగా  ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. ఇంకా టైటిల్ అయితే అనౌన్స్ చేయలేదు. దర్శకుడు వివి వినాయక్ అనుకున్న కత్తిలాంటోడు టైటిల్ గా కన్ ఫర్మ్ కాదు అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. 

మరి టైటిల్ ఏమిటో అన్నది 22న తెలుస్తుందో లేక కేవలం చిరంజీవి ఫస్ట్ లుక్ మాత్రం వస్తుందో? అయితే ఈ ఫస్ట్ లుక్ కు కూడా హైప్ తెచ్చే ప్రయత్నం ప్రారంభమైంది. ఎందుకంటే యూ ట్యూబ్ లో ఎన్ని హిట్ లు వచ్చాయి అన్నది ఈ మధ్య కాస్త పట్టించుకుంటున్నారు. మహేష్ సినిమాకు ఇన్ని లుక్ లు, ఎన్టీఆర్ సినిమాకు ఇన్ని లుక్ లు , అవి కూడా ఇన్ని గంటల్లో, ఇన్ని రోజుల్లో అంటూ లెక్కలు తీస్తున్నారు. 

అయితే టీజర్ అయితే యూ ట్యూబ్ హిట్ లు వస్తాయి. ఫస్ట్ లుక్ అంటే ఫ్యాన్స్ దాన్ని విడియో చేసి పెట్టాల్సి వుంటుంది.  అలాంటపుడు చిరు సినిమాకు కూడా ఆ రేంజ్ హిట్ లు రావాల్సి వుంటుంది. అలా రావాలంటే ఇప్పటి నుంచి ముందు ఆ ఫస్ట్ లుక్ కు హైప్ తేవాలి. అందుకే ఆ ప్రయత్నం మొదలైంది. 

అందులో భాగంగా వరుణ్ తేజ బైట్ బయటకు వదిలారు. మరో నాలుగు రోజుల్లో చిరంజీవి ఫస్ట్ లుక్ వస్తుందని, చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాం అంటూ. ఇక ఈ బ్యాలెన్స్ నాలుగు రోజుల్లో మెగా హీరోలంతా బైట్..బైట్ అంటూ బయటకు వస్తారన్నమాట. ఆ మేరకు హిట్ లు వస్తాయా? చూడాలి. Readmore!

Show comments

Related Stories :