దోపీడీకి దొడ్డిదారి ఫైబర్ నెట్?

ఇంటర్ నెట్ బ్రాడ్ బాండ్ వాడేవారికి తెలుసు దాని ప్యాకేజీలు, రేట్లు

కేబుల్ వాడేవారికి తెలుసు..దాని ప్యాకేజీలు..రేట్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటవుతున్న ఫైబర్ నెట్ వల్ల జనాలకు బోలెడు లాభం అని, వెసులుబాటు అని, ఉపయోగం అని ప్రచారంతో ఊదరగొడుతున్నారు? ఏమిటి లాభం? అని చూడాల్సి వుంది?

ప్రస్తుతం కేబుల్ కానీ, డిష్ కానీ 200 నుంచి 250 ఖర్చు చేస్తే దాదాపు ముఖ్యమైన అన్ని చానెళ్లు వస్తాయి. ఫైబర్ నెట్ లో 149కే చానెళ్లు వస్తాయట. కానీ ఇక్కడే వుంది అసలు మతలబు. పెయిడ్ చానెళ్లు రావు. అంటే మాటీవీ, జెమినీ టీవీ, జీ టీవీ రానే రావు అన్నమాట. అవి కావాలంటే అదనంగా చెల్లించాలి. అంటే మళ్లీ అదే టారిఫ్ అవుతుందిగా? Readmore!

సరే, ఇంటర్ నెట్ విషయానికి వస్తే, 15ఎంబీపీఎస్ స్పీడ్ అది కూడా 5 జీబీ లిమిట్. బ్రాడ్ బాండ్ వాడేవాళ్లకు తెలుసు. అయిదు జీబీ అంటే అయిదు రోజులు కూడా రాదని. అంటే అప్పుడు తరువాతి ప్యాకేజ్ లకు వెళ్లాల్సి వుంటంది. అలాగే స్పీడ్ విషయంలో కూడా.

అంటే బేసిక్ గా, ఈ 149 ఆశ చూపించి, బ్రాడ్ బ్యాండ్, కేబుల్ వ్యాపారంలో లాభాల ఆర్జనకు ప్రయివేటు కంపెనీలు, ప్రభుత్వంతో కలిసి తెరతీస్తున్నాయి. పోనీ ఇంత చేసి అయినా కేబుల్ ఆపరేటర్లు వుండరా అంటే, ఇప్పుడున్నవారే వుంటారు. వారే రన్ చేస్తారు. కానీ గుతాధిపత్యం కిందకు ఈ వ్యవహారం చేరిపోతుంది.

జనాలకు ఇంకో వాయింపు ఏమిటంటే, ఇప్పటికే ఒకటికి రెండు సెట్ అప్ బాక్సులు మారాయి. ఇది చాలదన్నట్లు ఫైబర్ నెట్ వస్తే వీటిని మూలన పడేసి, మరో రెండు బాక్స్ లు కొనాలట. అది కూడా నాలుగువేల పైచిలుకు ధరకు.

ఇన్ని వాయింపులు పడే బదులు డిష్ పెట్టుకుని, నెట్ కావాల్సిన వాళ్లు వారి ఛాయిస్ ప్రకారం వెళ్లడం మేలేమో?

గ్రామాలకు నెట్ వస్తుందన్న ఒక్క ఉపయోగం మాత్రమే కనిపిస్తోంది తప్ప వేరు వ్యవహారం లేదు ఇందులో. అది మాత్స్రం సష్టం అవుతోంది.

Show comments

Related Stories :