అయ్యబాబోయ్‌.. ఆ కళ్ళేంటి.?

బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ 'హసీనా' అనే సినిమాలో నటిస్తోన్న విషయం విదితమే. ఏప్రిల్‌ 11న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో విశేషమేంటంటే, హసీనా ఎవరో కాదు.. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరి. దావూద్‌ ఇబ్రహీం మోస్ట్‌ వాంటెడ్‌.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! ఆ మాటకొస్తే, ఒకానొక సమయంలో దావూద్‌ గ్యాంగ్‌ దెబ్బకి, బాలీవుడ్‌ షేక్‌ అయిపోయింది. ఏదన్నా సినిమా వచ్చిందంటే చాలు, ఆ సినిమాని తన కనుసన్నల్లో నడిపించేవాడు దావూద్‌. 

ఇప్పుడు ఏకంగా, దావూద్‌ ఇబ్రహీం సోదరి హసీనా జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించడమంటే చిన్న విషయం కాదు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో వున్న దావూద్‌, అక్కడినుంచే 'సెటిల్‌మెంట్లు' చేయిస్తున్నాడనీ, అండర్‌ వరల్డ్‌ మాఫియా నడిపిస్తున్నాడనీ అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ దర్శకుడు అపూర్వ లఖియా, ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం విశేషమే మరి. 

సినిమా ఎలా వుంటుంది.? అన్న విషయం పక్కన పెడితే, ఫస్ట్‌ లుక్‌తోనే అదరగొట్టేసింది ఈ సినిమాలో నటిస్తోన్న శ్రద్ధా కపూర్‌. ఫస్ట్‌ లుక్‌ విడుదలయ్యాక, బాలీవుడ్‌లో ఇప్పుడంతా శ్రద్ధా కపూర్‌ కళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు. చాలా సినిమాల్లో శ్రద్ధా కపూర్‌ గ్లామరస్‌ రోల్స్‌లో కన్పించింది. మొన్నీమధ్యనే 'ఓకే జానూ' సినిమాలో నటించిన శ్రద్ధా, ఆ సినిమాలో బీభత్సమైన గ్లామర్‌ పండించేసింది. ఇప్పుడేమో ఇలా కంప్లీట్ మేకోవర్.. ఈ ఛేంజ్ అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

'హసీనా' సినిమాలో మాత్రం శ్రద్ధా కపూర్‌ చాలా సీరియస్‌గా వుంటుందట. అంతేనా, ఆమె కళ్ళ మీదనే దర్శకుడు ఎక్కువగా ఫోకస్‌ పెట్టాడట. అందుకే మరి, ఫస్ట్‌ లుక్‌ విషయంలోనూ, ఇదిగో ఇలా కళ్ళ మీదనే ఫోకస్‌ పెట్టేశారు. అందరితోనూ 'అయ్యబాబోయ్‌, ఆ కళ్ళేంటి..' అన్పించేశారు.

Show comments