ఆ స్టార్ హీరోకు అనారోగ్యం?

టాలీవుడ్ కు చెందిన ఓ సీనియర్ స్టార్ హీరో కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వయసు మీద పడినా అందంగా వుండే ఆ సీనియర్ గ్లామర్ స్టార్ హీరోకి కిడ్నీ సమస్య వచ్చిందని తెలుస్తోంది. మరీ ఇప్పటికిప్పుడు మంచం పట్టేంత అనారోగ్యం కాదని, అయితే కాస్త దీర్ఘకాలం ట్రీట్ మెంట్ అవసరం అని డాక్టర్లు చెప్పినట్లు వినికిడి. 

అయితే హైదరాబాద్ లో అయితే నలుగురికి తెలుస్తుందనో, లేక మంచి డాక్టర్ అనో, బెంగుళూరులో చికిత్స చేయించుకుంటున్నట్లు తెలిసింది. మరీ అవసరం అయితే డయాలసిస్ చేస్తారని, ప్రస్తుతానికి అయితే ఆ హీరో మెడిసిన్స్ మాత్రమే వాడుతున్నారని, స్ట్రిక్ట్ డయిట్ కంట్రోల్ మీద వున్నారని ఇండస్ట్రీ సర్కిళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

టీవీ చానెళ్లలో ఆరోగ్య కార్యక్రమాలు చూసే జర్నలిస్టులకు ఈ హీరో ట్రీట్ మెంట్ చేయించుకునే డాక్టర్ టచ్ లో వుండడంతో ఈ వార్త బయటకు పొక్కింది. మరి నిజమెంతో తెలియాల్సి వుంది. ప్రస్తుతానికి అయితే ఆ హీరో బయట హుషారుగానే తిరుగుతున్నారు.

Show comments