పూజా బేడీ.. కామసూత్ర కండోమ్స్ యాడ్ లో నటించడానికి కూడా సంకోచించనంత బోల్డ్. కేవలం డబ్బు కోసమే కాదు.. హెచ్ ఐవీ ప్రమాదం విషయంలో సామాన్య ప్రజానీకానికి అవగాహన పెంచడానికి ఉద్దేశించిన కార్యక్రమాల్లో కూడా ఆమె భాగస్వామి అయ్యారు. హీరోయిన్ కు తక్కువ, సపోర్టింగ్ ఆర్టిస్టుకు ఎక్కువలా సాగింది పూజ ప్రస్థానం. తెలుగులో కూడా 'చిట్టెమ్మ మొగుడు' వంటి సినిమాలో గ్లామరస్ డాక్టర్ పాత్రలో కనిపిస్తుంది.
ఆమె సంగతి అటుంచితే.. ఇతర సెలబ్రిటీల పిల్లల మాదిరి స్విమ్ సూట్ల పోజుల్లో నిలుస్తోంది పూజా బేడీ తనయ ఆలియా. ఇప్పటికే అమితాబ్ గ్రాండ్ డాటర్ నవ్యా నవేలీ, షారూక్ ఖాన్ కూతురు సుహానా, సైఫ్ అలీఖాన్ కూతురు సారాలు.. టీనేజ్ దాటకుండానే స్విమ్ సూట్ల పోజులతో వార్తల్లోకి వచ్చారు. ప్రైవేట్ గా తీయించుకున్నవే అయినా.. ఈ ఫొటోలు పబ్లిక్ లోకి వచ్చేశాయి. వీరికి ఏ మాత్రం తీసిపోని రీతిలో పూజా బేడీ తనయ ఆలియా తన సోషల్ నెట్ వర్కింగ్ అకౌంట్ ద్వారా అనునిత్యం హాట్ హాట్ పిక్స్ ను పోస్టు చేస్తోంది.
స్విమ్ సూట్లలో, అంతకు మించిన స్లైలిష్ వేర్ లో అందాల ప్రదర్శన చేస్తూ వాటిని సోషల్ మీడియా ద్వారా తన ఫాలోయర్లకు చేరవేస్తోంది ఆలియా. కురచదుస్తుల్లో అబ్బాయిలతో ఈత కొలనుల్లో ఈదుతూ దిగిన ఫొటోలు, మందుకొడుతూ దిగిన ఫొటోలు, బెడ్ షీట్ వెనుక తను నగ్నంగా ఉన్నానని చాటేలా తీసుకున్న సెల్ఫీలు.. ఇవే ఈ అమ్మాయి పెట్టే పోస్టింగులు. ఇప్పటికే మోడలింగ్ లో పని చేస్తున్న ఆలియా.. ఇంత హాట్ గా కనిపించేస్తుండటం ఈ పాటికి బాలీవుడ్ గమనించే ఉండవచ్చు!