శృంగార స్పందనలు.. పడకింటిని దాటుతున్నాయ్..!

నడుస్తోంది అపార్ట్ మెంట్ కల్చర్.. అలాగే, శృంగారం విషయంలో పెద్దగా మొహమాటాలు లేని తరం ఇది! మరి ఇలాంటి తరుణంలో శృంగారనందంలో తీయగా చేసే శబ్ధం బెడ్రూమ్ పరిధి దాటుతోంది! పడగ్గదికి ఆనుకుని ఉన్నది పక్కింటి గదే అయితే అక్కడకూ సులభంగానే చేరుతోంది. నయా జనరేషన్ లోని జంటలకు తమ ప్రణయ ప్రబంధం పక్కవారికి అర్థమవుతోందని తెలిసినా.. పెద్దగా ఫీలయ్యేదేమీ లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఎక్స్ ప్రెస్ అవర్ సెల్ఫ్.. అన్నట్టుగా వీళ్లు దూసుకుపోతున్నారట! 

మోనింగ్ గా వ్యవహరించే ఈ శబ్దంతో మత్తెక్కించడంలో అమ్మాయిలు ముందుంటారని.. ఇవి ఒకరకంగా అసంకల్పిత ప్రతీకార చర్యలే అని అంటున్నారు సెక్సాలజిస్టులు. స్థాయిలో కొంచెం తేడా ఉండొచ్చు కానీ.. 80 శాతం మంది మహిళల్లో ఈ తరహా అనుభూతి వ్యక్తం అవుతుందని వీరు గణాంక సహితంగా వివరిస్తున్నారు. కొందరి స్పందన డెసిబెల్స్ లో కొలవదగ్గ శబ్దం! 

దీన్ని ప్లజర్ కు సంకేతం అని చెబుతున్నారు ఎక్స్ పర్ట్ లు. ఆమె మధురానుభూతికి లోనవుతోందనేందుకు మోనింగ్ ముఖ్యమైన సూచిక అని వీరు చెబుతున్నారు. ఆ సుఖంలో తనను తాను నియంత్రించుకోలేని సమయంలో.. ఆమె తీయని శబ్దం చేస్తుందని వివరించారు. ఆమెకు కూడా ఇది మంచి ఫీలింగ్ ను ఇస్తుందని చెబుతున్నారు.

ఈ మోనింగ్ కు సెక్స్ వల్ మర్మరింగ్ సహజ స్పందన.. ఇదో భావ వ్యక్తీకరణ అంటూ.. ఇదే సమయంలో ఒకరకమైన ఫేక్ ఆర్గాజమ్స్ కు కూడా ఈ శబ్దాలు ప్రతీక అని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. తమ పార్టనర్ ను ఉత్సాహ పరచడానికి కొంతమంది నోటి రెచ్చగొట్టే శబ్దాలు చేస్తే, మరికొంత మంది ఈ విధంగా శృంగార ప్రక్రియపై తమ ఇష్టతను తెలియ చేస్తారని, కొనసాగించమని కోరే అభ్యర్థన కూడా ఇదే అని చెబుతున్నారు. సినిమాల్లో చూసి ఈ విధమైన ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చే వాళ్లూ ఉంటారని వైద్యులు చెబుతుండటం విశేషం. 

అలాగే శృంగార ప్రక్రియను తొందరగా ముగించడానికి కూడా ఈ విధంగా వ్యవహరించే వాళ్లు ఉన్నారని వీరు పేర్కొన్నారు. మోనింగ్ మరీ లౌడర్ అయితే అది ఫేక్ ఆర్గజమ్ కూడా అయ్యుండొచ్చని వివరించారు. 

Show comments