రెండు నెలలు-డజనుకుపైగా సినిమాలు

అక్టోబర్ నెలాఖరు అంటే గట్టిగా 60 రోజులు లేదు. అంటే పదివారాలు. దాదాపు డజనుకు పైగా సినిమాలు మేం రెడీ..మేం రెడీ అంటున్నాయి. తొలివారంలో జో అచ్యుతానంద, ఇంకొక్కడు బోణీ కొడుతున్నాయి. అవసరాల శ్రీనివాస్ జో అచ్యుతానందకు మంచి బజ్ వుంది. ఆ తరువాత శ్రీకాంత్ తనయుడు రోహన్ హీరోగా తయారైన నిర్మల కాన్వెంట్ రెడీగా వుంది. ఈనెల 16న విడుదలకు.  మూడో వారంలో రావడానికి నాని, విరించి వర్మ కాంబినేషన్ లోని మజ్ఞు ఫిక్సయిపోయింది. నెలాఖరులో రావడానికి హైపర్ రెడీగా వుంది. రామ్ లేటెస్ట్ మూవీ ఇది. అంటే 9 నుంచి 30లోగా మూడు వారాల్లో అయిదు కీలకమైన సినిమాలు రెడీ అయిపోయాయి.

ఇక అక్టోబర్ ఫస్ట్ వీక్ కోసం చాలా సినిమాలురెడీ గా వున్నాయి. సునీల్ వీడు గోల్డ్ ఎహె రెడీ అయిపోయింది. వీరు పోట్ల దర్శకుడు. నాగ్ చైతన్య ప్రేమమ్ కూడా అప్పుడే రావాలని డిసైడ్ అయింది. ఈ డేట్ ను రామ్ చరణ్ ధృవ వదిలేసుకున్నట్లే. కన్నడ రాజకీయ ప్రముఖుడు కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ ఫస్ట్ మూవీ జగ్వార్ కూడా టెంటటివ్ గా అనుకుంది కానీ ఈ కాంపిటీషన్ లో దిగుతుందా అన్నది అనుమానం

ఆ తరువాతి వారం కోసం అల్లరి నరేష్ సినిమా రుమాలు వేసేసింది. ఇంట్లో దెయ్యం..నాకేం భయ్యం అంటూ సినిమా రెడీ అయింది. ఆ తరువాతి వారంలో రావాలని రాజ్ తరుణ్ అనుకుంటున్నాడు. అతగాడి సినిమా రాజుగాడు దాదాపు పూర్తి కావచ్చింది. రాజ్ తరుణ్ తన మరో సినిమాను డిసెంబర్ లో తేవాలనుకుంటున్నాడు. అందువల్ల ఆ సినిమాకు ఈ సినిమాకు గ్యాప్ వుండేలా అక్టోబర్ లోనే ఈ సినిమా విడుదల చేయాలని ఆలోచనలో వున్నాడు. 

అక్టోబర్ మూడో వారంలో రావడానికి కార్తీ తన కాష్మోరాతో రెడీ అయిపోయాడు. పివిపి సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాపై కూడా మంచి అంచానాలు వున్నాయి. అంటే మొత్తం అక్టోబర్ కు ఇప్పటికి ఫిక్స్ అయినవి అయిదారు సినిమాలు అన్నమాట. 

ఇవి కాక ఇంకా ప్లానింగ్ లో వున్నవి, అవి కాక ఇంకా పలు చిన్నా చితకా సినిమాలు. అన్నీ కలిపి దాదాపుగా.. నూరు నూటా యాభై కోట్లకు పైగానే వ్యాపారం. రెండు నెలల్లో.

Show comments