పవన్.. స్పెల్లింగులు సరిగా నేర్చుకోవాలేమో!

రాజకీయ నేతలు ఇలా దొరికిపోకూడదు. గ్లామర్ ను నమ్ముకుని వచ్చిన మీ రాతల్లో గ్రామర్ దోషాల సంగతేమో కానీ, ఒక రాష్ట్రం పేరును తప్పుగా రాయడం మాత్రం ఈజీగా క్షమించేసే వ్యవహారం కాదు. ఆంధ్ర ప్రదేశ్ ను సులభంగా ‘ఏపీ’ అని రాసేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో తెలంగాణ స్పెల్లింగ్ ను మాత్రం తప్పుగా రాశాడు.

తెలంగాణ సాయుధ పోరాటం తనకు స్ఫూర్తి, తెలంగాణ ఆత్మ ఘోష నాకు తెలుసు.. అంటూ తరచూ చెప్పుకునే పవన్ కల్యాణ్ అదే  ‘తెలంగాణ’ కు ఇంగ్లిష్ స్పెల్లింగును మాత్రం తప్పుగా రాశాడు.

ఏదో ప్రెస్ నోట్లో ఇలాంటి తప్పులొచ్చి ఉంటే అదో లెక్క. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పులొస్తే.. సెటైర్లు తప్పవు. అవే పడుతున్నాయి పవన్ పై ఇప్పుడు.

Show comments