ధైర్యం చేస్తున్న నాగ చైతన్య

దడ, బెజవాడ, ఆటోనగర్‌ సూర్య... ఇలా ఎప్పుడు మాస్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేసినా నాగచైతన్యకి చుక్కెదురైంది. దాంతో లవర్‌బాయ్‌ పాత్రలకి పరిమితమై కంఫర్ట్‌ జోన్‌ ఎంజాయ్‌ చేస్తోన్న చైతన్యకి అడపాదడపా హిట్లయితే వస్తున్నాయి కానీ అతను ఆశిస్తోన్న పెద్ద బ్లాక్‌బస్టర్‌ రావట్లేదు.

రేంజ్‌ పెరగాలంటే రీచ్‌ పెరగాల్సిందేనని చైతన్య రియలైజ్‌ అయ్యాడు. అందుకే మరోసారి మాస్‌ మంత్రం వల్లిస్తున్నాడు. 'ప్రేమమ్‌' చిత్రంలో గడ్డం పాత్రని చాలా బాగా ప్రెజెంట్‌ చేసి, చైతన్యని మ్యాన్లీగా చూపించిన దర్శకుడు చందు మొండేటి ఈసారి చైతన్య కోసం పూర్తి స్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌ని తయారు చేస్తున్నాడట. 

ప్రేమమ్‌ కంటే ముందు చైతన్యకి ఒక ప్రేమకథ వినిపించిన చందు ఇప్పుడు ఆ సబ్జెక్ట్‌ డ్రాప్‌ అయి చై కోసం మాస్‌ కథని సిద్ధం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నాగార్జున కూడా ఒక కీలక పాత్ర పోషిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. చైతన్య మాస్‌ అవతారాన్ని వీక్షించేలోగా 'రారండోయ్‌ వేడుక చూద్దాం' అనే ఫ్యామిలీ డ్రామా, మరో థ్రిల్లర్‌ వస్తాయి. అన్ని జోనర్స్‌ ట్రై చేస్తోన్న చైతన్య ఈ సినిమాలతో హీరోగా ఎంత ఎత్తుకి ఎదుగుతాడో చూద్దాం.

Show comments