'బాహుబలి' సెగ వాళ్లకే బాగా

'బాహుబలి' విజయం తెలుగు హీరోలపై ఒత్తిడి పెంచి వుండాలి. 'మీరెందుకు ఇలాంటి సినిమాలు అటెంప్ట్‌ చేయరు?' అంటూ అభిమానులు, మీడియా మన హీరోలని ప్రశ్నిస్తూ వుండాలి. అయితే 'బాహుబలి' ఎఫెక్ట్‌ మన వాళ్లపై కంటే బాలీవుడ్‌ హీరోల మీదే ఎక్కువ పడింది. ఒక ప్రాంతీయ భాషా చిత్రాన్ని ఈ స్థాయిలో తీసినపుడు, ఇంత మార్కెట్‌ వుండి, ఇన్ని వనరులు వుండి మీరెందుకు నాసిరకం సినిమాలు తీస్తున్నారంటూ బాలీవుడ్‌ సూపర్‌స్టార్లని నిలదీస్తున్నారు.

సల్మాన్‌ ఖాన్‌ 'ట్యూబ్‌లైట్‌' టీజర్‌ రిలీజ్‌ అయితే 'వహ్వా భాయ్‌' అనడం పోయి, 'బాహుబలి'లాంటిది చేయకుండా ఎన్నాళ్లు ఇలాంటివి మా నెత్తిన రుద్దుతారు అంటూ యూట్యూబ్‌లో పబ్లిక్‌ సల్మాన్‌ని ప్రశ్నిస్తోంది. ఒక ప్రాంతీయ భాషా చిత్రం భారతీయ సినిమా రికార్డులన్నీ బ్రేక్‌ చేస్తే, ఖాన్‌ త్రయం ఇంకా పాత పద్ధతులనే ఫాలో అవుతోందంటూ నిందిస్తోంది.

బాహుబలిని హిందీలో తీసి అది ఇంతటి హిట్‌ అయితే వేరేలా వుండేదేమో కానీ తెలుగు నుంచి హిందీకి అనువాదమై బాలీవుడ్‌ రికార్డులని తిరగరాస్తుంటే మాత్రం అక్కడి వారి ఈగో హర్ట్‌ అవుతోంది. ఇంతవరకు బాలీవుడ్‌ బిగ్‌ స్టార్స్‌లో ఎవరూ బాహుబలి గురించి ఏమీ ట్వీట్‌ చేయకపోవడాన్ని బట్టే ఇది వారి ఈగోని ఏ స్థాయిలో హర్ట్‌ చేసిందనేది తెలుస్తోంది.

Show comments