బాలీవుడ్ బ్యాచ్ లో చేరిన బాహుబలి

మొన్నటివరకు అమెరికాలో ఉన్నాడు ప్రభాస్. కాబట్టి బాహుబలి-2 సెలబ్రేషన్స్ కు సంబంధించి చాలా పార్టీలు మిస్ అయ్యాడు.

అమెరికా నుంచి ఇలా తిరిగొచ్చాడో లేదో పార్టీలు షురూ అయ్యాయి. మరీ ముఖ్యంగా ప్రభాస్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న కరణ్ జోహార్.. గ్రాండ్ పార్టీ ఇచ్చాడు.

బాహుబలి ఫ్రాంచైజీని బాలీవుడ్ లో రిలీజ్ చేసిన ఈ దర్శక-నిర్మాత.. ఆ ప్రాజెక్టుతో భారీగానే లాభాలు ఆర్జించాడు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు పార్టీలిచ్చిన కరణ్ జోహార్.. ప్రభాస్ వచ్చాడని తెలిసిన వెంటనే పెద్ద పార్టీ ఎరేంజ్ చేశాడు. ముంబయిలో నిన్న రాత్రి జరిగిన ఈ పార్టీలో ప్రభాస్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. రానా కూడా పార్టీలో ఉన్నాడు.

ప్రభాస్ తో కరణ్ జోహార్ ఓ భారీ సినిమా ప్లాన్ చేశాడంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ సాహో సినిమాలో అలియాభట్ హీరోయిన్ గా నటించనుందంటూ కథనాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో.. పార్టీలో ప్రభాస్-కరణ్ జోహార్, ప్రభాస్-అలియాభట్ కలవడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పార్టీకి బాలీవుడ్ కు చెందిన కుర్రహీరోలతో పాటు.. కరణ్ జోహార్ బ్యాచ్ మొత్తం హాజరైంది.

Show comments