బయో పిక్‌.. తాప్పీ ఓటు వారికే

'నామ్‌ షబానా' సినిమాతో ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది అందాల భామ తాప్సీ. సౌత్‌లో తనకున్న గ్లామరస్‌ ఇమేజ్‌కి భిన్నంగా వెరైటీ పాత్రల్ని బాలీవుడ్‌లో ఎంచుకుంటోన్న తాప్సీ, 'నామ్‌ షబానా' సినిమా కోసం చాలా చాలా... చాలా చాలా కష్టపడింది. 'ఒక్క చాలా సరిపోదు.. చాలా చాలా చాలా కావాలి.. అంత కష్టపడ్డాను ఈ సినిమా కోసం.. ఎంతలాగంటే, పలు సందర్భాల్లో యాక్షన్‌ సీక్వెన్సెస్‌ జరుగుతున్నప్పుడు గాయాలయ్యాయి కూడా.. శిక్షణ తీసుకుంటున్నప్పుడు తగిలిన గాయాలకైతే లెక్కే లేదు..' అంటూనే, ఎన్ని దెబ్బలు తగిలినా, సినిమా చాలా బాగా వచ్చిందుకు తాప్సీ ఫుల్‌ హ్యాపీగా వుందట. 

ఇక, బయోపిక్‌ చేయాల్సి వస్తే ఎవర్ని ఎంచుకుంటారు.? అన్న ప్రశ్నకు తాప్సీ ఆసక్తికరమైన సమాధానమిచ్చింది. తాప్సీకి, టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జా జీవిత చరిత్రలో నటించాలని వుందట. రాజకీయాల్లో ఆమెకు ఇందిరాగాంధీ అంటే ఇష్టమట. ఇందిర ఇష్టం అయినంతమాత్రాన తాను రాజకీయాల గురించి మాట్లాడబోననీ, ఆమె డైనమిక్‌ వ్యక్తిత్వం తనకు బాగా ఇష్టమనీ తాప్సీ చెప్పుకొచ్చింది. 

హీరోయిన్‌కి గ్లామర్‌ ఎంత అవసరమో, గ్రామర్‌(నటన) కూడా అంతే అవసరమని చెబుతున్న తాప్సీ, త్వరలో కంప్లీట్‌ గ్లామరస్‌ రోల్‌లో కన్పిస్తానంటోంది. 'నామ్‌ షబానా' సినిమా ప్రమోషన్‌ కోసం దేశమంతా తిరగడం చాలా కొత్త అనుభూతినిచ్చిందని తాప్సీ చెబుతోంది. సౌత్ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయనీ.. బాలీవుడ్ సినిమాల్లో బిజీగా వున్నా, సౌత్ సినిమాలంటే అభిమానం అలాగే వుందనీ, చిన్న గ్యాప్ వచ్చినంతమాత్రాన సౌత్ సినిమాలకు తాను దూరమయ్యానన్న గాసిప్స్ తగదని తాప్సీ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది.

Show comments