నితిన్ లుక్ నే కాదు బడ్జెటూ అదిరింది

సాధారణంగా బడ్జెట్ ను సబ్జెక్ట్ డిమాండ్ చేస్తుందనడం వాస్తవమే అయినా, హీరో మార్కెట్ ను కూడా దృష్టిలో వుంచుకుంటారు. హీరో నితిన్ అ..ఆ సినిమా కోసం 36 కోట్ల బడ్జెట్ అయింది. నలభై కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి ఓకె అయిపోయింది. అయితే మంచి సినిమా, మంచి కాంబినేషన్ పడితే ఆ రేంజ్ వుందని రుజువయింది.

లేటెస్ట్ విషయానికి వస్తే నితిన్-హనురాఘవపూడి కాంబినేషన్ లో 14 రీల్స్ సంస్థ లై అనే ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాకు బడ్జెట్ నలభై కోట్లకు పైగానే అవుతోందట. సినిమా 80 శాతం విదేశాల్లోనే షూట్ చేస్తున్నారు. పైగా సాంకేతికంగా చాలా హైగా వుంటుందట సినిమా. అందువల్లే 40 కోట్లకు  పైగా ఖర్చవుతోందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే అదర్ లాంగ్వేజెస్ డబ్బింగ్/రీమేక్ రైట్లు వంటి వాటికి మంచి రేటు పలకిందట.

మరో వారం రోజుల్లో ఇండియాకు వచ్చి, పది రోజులు వర్క్ చేస్తే చాలు లై సినిమా పూర్తయిపోతుందట. ఆగస్టు 11న విడుదల కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇంటిలిజెంట్ థ్రిల్లింగ్ ప్లస్ లవ్ సబ్జెక్ట్ తో తయారవుతున్న లై నితిన్ కెరీర్ లోనే హై బడ్జెట్ సినిమా అన్నమాట. ఈ సినిమాలో నితిన్ పూర్తిగా కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు.

Show comments