పూరి ఫీలయ్యారా?

టాలీవుఢ్ లో వ్యవహారాలు చిత్రంగా వుంటాయి. అయినవాళ్లయితే ఒకటి, కాని వాళ్లయితే మరొకటి. పైగా తెర వెనుకు కులాల వ్యవహారం వుండనే వుంది. చావయినా అంతే, అవార్డులయినా అంతే. ఈ ఈక్వేషన్లు అన్నీ దాటుకుని రావాల్సిందే. మంచో, చెడో, పక్కన పెడితే ఎవరి అభిమానం వారిది. అందుకే ఓ అభిమాని ఏకంగా దర్శకుడు పూరిజగన్నాధ్ విగ్రహం పెట్టేసాడు. ఆవిష్కరణకు పూరి కొడుకు ఆకాష్ వెళ్లాడు.

ఇప్పుడు ఈవార్తకు, కానీ సంఘటనకు కానీ మన మీడియా అంత ప్రాధాన్యత ఇవ్వలేదని, దర్శకుడు పూరి జగన్నాధ్, ఆయన సర్కిల్ జనాలు ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక రాజమౌళి విగ్రహమో, మరొకరి విగ్రహమో పెట్టి వుంటే మీడియా మొదటి పేజీల్లో వార్తలు కుమ్మేసి వుండేదని అనుకుంటున్నారట. అంతవరకు ఎందుకు తమిళనాడులో నటీ నటులకు గుడి కడితేనే మన మీడియా అర్జెంట్ గా అచ్చేస్తుంది. కానీ ఇక్కడ మా పూరి విగ్రహం పెడితే కవరేజే వుండదు అని ఆయన సర్కిల్ జనాలు కామెంట్ చేస్తున్నారు.

అయినా ఈ విగ్రహాలు పెట్టడం ఏమిటో? సినిమా జనాలను దేవుళ్లలా చూసే మెంటాలిటీ ఇంకెప్పటికి మారుతుందో?

Show comments