రీల్‌ రొమాన్స్‌లో రెచ్చిపోతే తప్పేంటి.?

''తెరపై అందంగా కన్పించాలి.. ఆ అందం అన్నదానికి నిర్వచనం చెప్పడం అంత తేలిక కాదు. చీకట్టులో అందం వుంటుంది.. బెడ్‌ రూమ్‌లో నైట్‌ డ్రెస్‌లో ఇంకో అందం వుంటుంది.. బాత్‌రూమ్‌లో బాత్‌ డ్రెస్‌లో మరో అందం వుంటుంది.. ఫలానా విధంగా కనిపిస్తేనే అందం.. అని చెప్పడానికి వీల్లేదు..'' అంటోంది బాలీవుడ్‌ బ్యూటీ సనాఖాన్‌. 

'వజా తుమ్‌ హో' సినిమాలో హాట్‌ హాట్‌గా నటించేసిన ఈ భామ, రీల్‌ రొమాన్స్‌కీ రియల్‌ రొమాన్స్‌కీ చాలా తేడా వుందంటోంది. 'రీల్‌ రొమాన్స్‌ అనేది కేవలం నటన.. దాన్ని నటులుగా మేం ఫీల్‌ అవలేం.. ఆ సమయానికి దర్శకుడు ఎలా చెబితే అలా నటించడం మాత్రమే.. దానికి రియల్‌ రొమాన్స్‌లా ఫీలవుతామనే భావనను మీడియా కల్పించడంలో అర్థమే లేదు..' అంటూ రీల్‌ లైఫ్‌ రొమాన్స్‌ గురించి చెప్పుకొచ్చింది. 

రొమాంటిక్‌ ఇంటిమేట్‌ సీన్స్‌లో నటించేటప్పుడు మాకంటూ కొన్ని హద్దులుంటాయి.. చుట్టూ పది నుంచి పాతిక మంది వరకూ యూనిట్‌ సిబ్బంది వుంటారు.. పర్సనల్‌గా హీరో, హీరోయిన్‌ రొమాన్స్‌ చేసుకునే అవకాశమెక్కడిది.? అని ప్రశ్నిస్తోంది సనాఖాన్‌. ఏ సినిమా చేసినా, అందులో పాయింట్‌ నచ్చి ఓకే చేస్తామనీ, ఆ తర్వాత ఆ సినిమాకి సంపూర్ణమైన కమిట్‌మెంట్‌ ఇవ్వడం నటిగా తన బాధ్యత అని సనాఖాన్‌ చెబుతోంది. 

రీల్‌ రొమాన్స్‌లో ఎంతగా రెచ్చిపోతే, తెరపై చూసే ప్రేక్షకులు అంతగా కనెక్ట్‌ అవుతారు.. రొమాంటిక్‌ సినిమాలు తీసేది అందుకే కాబట్టి, దాని గురించి రాద్దాంతం చేయడం అనవసరమన్నది సనాఖాన్‌ వాదన. ఏ సినిమాలో ఏ హీరోతో రొమాన్స్‌ చేస్తే, ఆ హీరోతో లింకులు వున్నాయని గాసిప్స్‌ సృష్టించేయడం హాస్యాస్పదమనీ, ఒక్కోసారి ఆ గాసిప్స్‌ తనకూ నవ్వు తెప్పిస్తాయంటోంది సనాఖాన్‌.

Show comments