బాలయ్యకు కథ చెప్పిన కొత్త డైరక్టర్

ఇప్పటికే 101వ సినిమా స్టార్ట్ చేసేసి ఓ షెడ్యూలు ఫినిష్ చేసేసాడు నందమూరి బాలయ్య. కేఎస్ రవికుమార్ స్టోరీ ప్రాజెక్టు ఓకె చేసి 102 వ సినిమాగా పక్కన వుంచాడు. మూడో సినిమాకూ ఇప్పుడు రెడీ చేసేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ కొత్తదర్శకుడు మాంచి లైన్, స్క్రిప్ట్ వినిపించాడట బాలయ్యకు.

అంతా ఓకె. కానీ కాస్త ఫ్యాన్స్ కు కావాల్సిన మసాలాలు, తాలింపులు జోడించి, ఫైనల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పాడట బాలయ్య. పెర్ ఫెక్ట్ గా రెడీ అయితే, దాన్నే 102 వ సినిమాగా చేసేద్దామని కూడా చెప్పాడట. అంతా ఓకె అయితే 14రీల్స్ పతాకంపై ఈ సినిమా వుండే అవకాశం వుంది.

అనకూడదు కానీ, చాలా మంది యంగ్, టాప్ హీరోలకన్నా బాలయ్యే బెటర్ లా వుంది. చకచకా స్ట్రిప్ట్ లు ఓకె చేస్తున్నారు. సినిమాలు చేస్తున్నారు. పైగా రాజకీయాలు, ఎమ్మెల్యే, అసెంబ్లీ వ్యవహారాలు మామూలే. 

Show comments