ఎన్ని కథలు వింటారో వెంకీ?

బాబు బంగారం, ఆ వెంటనే గురు సినిమాలు అందించేసాడు విక్టరీ వెంకటేష్. మరి ఆ తరువాత మాత్రం బండి ముందుకు కదలడం లేదు. సరైన సినిమా సెట్ కావడం లేదు.

సమ్మర్ ట్రిప్ కు వెళ్లక ముందు, వెళ్లి వచ్చిన తరువాత కూడా కథలు వినడంతోనే సరిపోతోంది. ఆయనకు ఏ కథలూ ఒకంతట నచ్చడం లేదు. కానీ అలా నచ్చని కథలు అలాగే వుండిపోవడం లేదు, వేరే హీరోలతో సినిమాలుగా మారిపోతున్నాయి.

ప్రస్తుతం వెంకీ పలువురు తమిళ కథకులు చెబుతున్న కథలు వింటున్నారట. సరైన కథ మాత్రం సెట్ కావడం లేదట. సబ్జెక్ట్ డిఫరెంట్ గా వుండాలి. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ మస్ట్ గా వుండాలి. ఏజ్ కు మ్యాచ్ కావాలి. మీడియం బడ్జెట్ లోనే ఫినిష్ కావాలి. ఇలా చాలా వున్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని వినికిడి. 

పైగా ఈ సారి సినిమాను సురేష్ మూవీస్ పై చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మామూలుగానే వెంకీ చేసే సినిమాలకు సంబంధించి ఇటు సురేష్, అటు వెంకటేష్ ఇద్దరి చేత ఓకే చేయించుకోవాలి. ఇక స్వంత బ్యానర్ అంటే మరీ కేర్ గా వుంటారు. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ఏ సినిమా సెట్ అవుతుందో?

Show comments