శర్వా..లవ్ మ్యారేజే నంట

శర్వానంద్ స్టయిలే వేరు. వైవిధ్యమైన సినిమాలు చేయడమే కాదు, వైవిధ్యంగా వుంటాడు కూడా. హీరోలను పెళ్లి ఎప్పుడు అని అడిగితే సాధారణంగా తప్పించుకోవడానికి చూస్తారు. ఏదోదే చెబుతారు. కానీ శర్వా ఓ ఇంటర్వూలో మొహమాటపడకుండా చెప్పేసాడు..లవ్ మ్యారేజ్ నే వుండొచ్చు అంటూ. 

ఇప్పటికి చాలా సార్లు ప్రేమలో పడ్డానని, లేచానని అన్నాడు. అయినా కూడా లవ్ మ్యారేజ్ అన్నాడంటే, శర్వా మనస్తత్వం అర్థమైపోతోంది. లవ్ అంటే అంత ఇష్టం వుండబట్టే కావచ్చు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో ప్రేమను అంత బాగా పండించేసాడు. 

ప్రేమలో పడి లేవడం సంగతి అలా వుంచి, కో అంటే కోటి సినిమా ద్వారా డబ్బు విలువ, ఆ విషయంలో తేడా వస్తే, మనవాళ్లు ఎవరు అనేది నికరంగా తేలడం కూడా శర్వాకు తెలిసివచ్చిందట. అందుకే ఇంత చిన్న వయసులోనే కాస్త ఫిలాసఫీ బాగానే వంటబట్టిందట. అదీ మ్యాటర్.

Show comments