హాట్ ఎఫైర్స్ పై అల్లరి నరేష్ ఆసక్తికర సమాధానం!

తన సరసన ఒక సినిమాలో నటించిన హీరోయిన్ తో మరో సినిమాను కూడా చేయడం అల్లరి నరేష్ కు ఒక అలవాటు. ఫర్జానా, పూర్ణ, సాక్షి చౌదరి, మోనాల్ గుజ్జర్, మంజరీ.. ఇలా చాలా మంది హీరోయిన్లతో ఒకటికి మించి సినిమాలు చేశాడు నరేష్. అది కూడా ఒక్కోరితో ఒక్కో సీజన్ లా… ఒక సినిమాలో ఈయన సరసన నటించిన భామ.. ఆ తర్వాతి సినిమాలో నటించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. 

ఈ పరంపరలో వినిపించే మాట.. సదరు హీరోయిన్లను నరేష్ ప్రమోట్ చేస్తున్నాడనేది! ఒక సినిమాలో తన సరసన నటించిన భామలకు ఆ తర్వాతి సినిమాలో తన పరపతిని ఉపయోగించుకుని ఇతడు అవకాశాలు ఇప్పిస్తున్నాడని.. ఇదంతా సదరు హీరోయిన్లతో నరేష్ కు ఉన్న ‘సాన్నిహిత్యం’ ఫలితమే అని ఇండస్ట్రీ నుంచి వార్తలు వస్తుంటాయి!

ఫర్జానా, మంజరీల విషయంలో అయితే ఈ ప్రచారం గట్టిగానే జరిగింది. దీనిపై ఒక టీవీ షోలో నరేష్ స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది. గతంలో జరిగిన ఈ ప్రచారం పై ఆయన మాట్లాడుతూ.. అదంతా పూర్తి అబద్ధం అనేశాడు. వాళ్ల తో వరసగా చేసిన సినిమాల వల్లనే ఆ ప్రచారం జరిగిందన్నాడు.

ఇక ఫర్జానా తో తనకు ఎఫైర్ ఉందనే వార్తలు వచ్చినప్పుడు.. ఆమెకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని నరేష్ అన్నాడు. అతడు కూడా షూటింగ్ స్పాట్ కు వచ్చేవాడని.. మీడియాలోనే తనకూ ఫర్జానాకు ఏదో నడుస్తోందని వార్తలు రావడం, మరోవైపు ఫర్జానా బాయ్ ఫ్రెండ్ తో కలిసి షూటింగ్ కు హాజరు కావడం జరిగిందని అన్నాడు. ఈ విషయం వారి కూడా తెలుసన్నాడు. వాళ్లిద్దరూ ప్రచారం గురించి నవ్వుకునే వాళ్లని … నరేష్ చెప్పాడు.

వాళ్లకు నవ్వులాట గానే ఉన్నా అప్పుడే తనకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలైందని, తనకు మాత్రం ఆ ప్రచారం టెన్షన్ పుట్టించిందన్నాడు.

Show comments