పేర్లు ఒకటైతే రిలీజు ఒక రోజనా?

వీడు గోల్డెహె...అంటీ వీడు బంగారం అనో లేదా బాబు బంగారం అనో అనుకోవాలన్నమాట. సునీల్ హీరో..బాబు బంగారంలో వెంకీ హీరో. మారుతి డైరక్షన్ వహించిన బాబు బంగారం ఆగస్టు 12న విడుదలకు రెడీ అయింది. దీంతో సునీల్ హీరోగా వీరుపోట్ల డైరక్షన్ లో చేస్తున్న వీడు గోల్డెహె కూడా అదే రోజు విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు వినికిడి. 

ఇదే హీరో పూర్తి చేసిన జక్కన్న ఈ నెల 29న విడుదలకు రెడీ అయింది. అది విడుదలయి రెండు వారాలు కాకుండానే మరో సినిమా అన్నమాట. అది కూడా బాబు బంగారం, తిక్క, మనమంతా, ఇలా చాలా సినిమాల మధ్యలో? ఇదేం ఆనందమో అని అంటే, ఇది ఇంగ్లీషు టైటిల్.. అది తెలుగు టైటిల్.. సరైన పోటీ అన్న జోక్ లు బదులుగా వినిపిస్తున్నాయట. 

Show comments