'బిగ్‌బాస్‌'కి ఆ ఛాన్స్‌ లేదు బాసూ.!

బుల్లితెరపై హోస్ట్‌గా కొత్త అవతారమెత్తిన జూనియర్‌ ఎన్టీఆర్‌, 'బిగ్‌బాస్‌' రియాల్టీ షోని ఓ రేంజ్‌లో రక్తి కట్టించేస్తున్నాడు. కానీ, ఏం లాభం.? వారాంతాల్లో మాత్రమే ఎన్టీఆర్‌ కనిపిస్తున్నాడు. మిగతా రోజుల్లో 'బిగ్‌బాస్‌' రియాల్టీ షో అంతా, డ్రమెటిక్‌గానే సాగుతోంది. డల్‌గా 'సాగు'తోంది. గ్లామర్‌ పెంచమని ఎన్టీఆర్‌ చెప్పినా, డల్‌నెస్‌ కన్పించకూడదని స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చినా, 'బిగ్‌బాస్‌' హౌస్‌లో పెద్దగా మార్పులేమీ కన్పించకపోవడంతో, బుల్లితెర వీక్షకులు ఈ షోని మిగతా రోజుల్లో లైట్‌ తీసుకుంటున్నారు. 

ఓపెనింగ్‌ డే కంప్లీట్‌గా ఎన్టీఆర్‌ షోనే. ఆ తర్వాత కంప్లీట్‌గా డల్‌ అయిపోయింది. మళ్ళీ వారాంతంలో ఎన్టీఆర్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ రెండ్రోజులపాటు షో రేటింగ్స్‌ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. యాజ్‌ యూజువల్‌ సోమ, మంగళవారాల్లో మళ్ళీ నీరసించిపోయింది. అసలు, ఈ షో కాన్సెప్టే అంత. అయినాగానీ, హౌస్‌మేట్స్‌ యాక్టివ్‌గా వుంటే, ఇంట్రెస్టింగ్‌గా షో మారే అవకాశాల్లేకపోలేదు. 

అక్కడికీ, ఎన్టీఆర్‌ చెయ్యాల్సిందంతా చేస్తున్నాడు. వారంలో ఒక్కరోజు షూట్‌ చేసేసి, వారమంతా దాన్ని 'ప్లే' చేయడానికీ వీల్లేని కాన్సెప్ట్‌ బిగ్‌బాస్‌. దాంతో, ఎన్టీఆర్‌ మిగతా రోజుల్లో ఈ షోలో కన్పించే అవకాశాల్లేవు. కానీ, అభిమానులు మాత్రం ఎన్టీఆర్‌ ప్రెజెన్స్‌ లేక 'బిగ్‌బాస్‌' వెలవెలబోతున్న వైనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 

ఏం చేస్తాం, వీకెండ్‌ వరకూ వెయిట్‌ చేయడమే.. అప్పుడెలాగే, ఈ ఐదు రోజుల నీరసాన్నీ, ఎన్టీఆర్‌ తనదైన ఎనర్జీతో ఎగరగొట్టేస్తాడు. అప్పటిదాకా బుల్లితెర వీక్షకులు కాస్త నీరసంగానే 'బిగ్‌బాస్‌' షో తిలకించకతప్పదు.

Show comments