గెస్ట్ రోల్ పై బన్నీ ఊగిసలాట

మలయాళ సినిమాభిమానుల్లో బన్నీకి భలే క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. తెలుగు మార్కెట్ రేంజ్ తో కాకున్నా, మలయాళ మార్కెట్ తో పోల్చుకుంటే స్ట్రయిట్ హీరో రేంజ్ బిజినెస్ వుంది అక్కడ. అందుకే ఇటీవల ఓ మలయాళ సినిమాలో గెస్ట్ రోల్ చేయమని బన్నీకి రిక్వెస్ట్ వచ్చిందట. మోహన్ లాల్ నటించే ఓ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించమని అడిగారట. 

అయితే ఇంత వరకు బన్నీ ఎస్ ఆర్ నో చెప్పలేదని వినికిడి. మరీ అర్జెంట్ అయితే రానాతో చేసినా బాగుంటుందని బన్నీ మలయాళ సినిమా యూనిట్ కు చిన్న సూచన చేసాడట కూడా. మరోపక్క సరైన పాత్ర కుదరితే శిరీష్ సినిమా దేంట్లో అయినా గెస్ట్ రోల్ చేయాలన్న ఆలోచన కూడా వుందట. 

బన్నీ చిన్న పాత్ర అయినా వేయాలి అంటే అది రుద్రమదేవి గోన గన్నారెడ్డి లెవెల్ లో వుండాలి. అప్పుడే ఆ కిక్ వుంటుంది.

Show comments