బాలయ్య సినిమా కేరాఫ్ తమిళనాడు

బాలయ్య 102వ సినిమాకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. 101వ సినిమా పైసా వసూల్ ఈ నెల 22తో షూటింగ్ పార్ట్ పూర్తయిపోతుంది. ఇకపై పోస్ట్ ప్రొడక్షన్ లో బాలయ్య పార్ట్ కేవలం డబ్బింగ్ వరకే. ఆపై సెప్టెంబర్ లో కాస్త ప్రచారానికి డేట్ లు కేటాయించాలి. అందుకే 102వ సినిమా మీదకు వెళ్లిపోవడానికి బాలయ్య రెడీ.

బాలయ్య 101వ సినిమా లెంగ్తీ షెడ్యూలు యూరప్ లో జరిగిన సంగతి తెలిసిందే. కథ నేపథ్యం అలాంటిది. ఇప్పుడు 102వ సినిమా నేపథ్యం తమిళనాడు లోని కుంభకోణం, చిదంబరం ప్రాంతం అంట. అందువల్ల సుమారు 40 రోజులకు పైగా షెడ్యూలు తమిళనాడులోనే ఆ ప్రాంతాల్లోనే వుంటుందట. దర్శకుడు కెఎస్ రవికుమార్ రాసుకున్న కథ నేపథ్యమే ఆ ప్రాంతాలు అని తెలుస్తోంది.

ఈ సినిమాను సమ్మర్ లోపు ఫినిష్ చేసి 103వ సినిమాగా బోయపాటితో ప్రాజెక్టు చేసే ఆలోచనలో వున్నారు బాలకృష్ణ.

Show comments