రేష్మీ ప్లేస్ లో హంసానందిని

మాంచి ఒడ్డు పొడవుతో, మాంచి ఫ్యామిలీ అయిటమ్ సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా అనిపిస్తుంది హంసా నందిని. అలాంటి హంసను త్రివిక్రమ్ అయిటమ్ అమ్మాయిని చేసారు. అప్పటి నుంచి అడపాదడపా కనిపిస్తోంది. తాజాగా రాజ్ తరుణ్ 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' సినిమాలో అయిటమ్ సాంగ్ కు హంసా నందనిని ఫిక్స్ చేసారు. 

రాజ్ తరుణ్ - 'దొంగాట' వంశీ కృష్ణ కాంబినేషన్ లో ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న కిట్టూ ఉన్నాడు జాగ్రత్త సినిమా లో ఓ అయిటమ్ సాంగ్ చేర్చాలని లాస్ట్ మినిట్ లో అనుకున్నారు. అప్పటి నుంచి చాలా పేర్లు వినిపించాయి. ఆఖరికి ఫైనల్ లిస్ట్ లో ఏంకర్ రేష్మీ పేరు వినిపించింది. కానీ మరి ఏం జరిగిందో ఇప్పుడు హంసానందిని ఫిక్స్ అయింది. 

రాజ్ తరుణ్ పక్కన హంసానందిని లాంటి హెవీ పర్సనాలిటీ అయిటమ్ పాపగానా అనుకోనక్కరలేదు. ఎందుకంటే ఈ సాంగ్ లో రాజ్ తరుణ్ వుండడు. హంసా నందిని మాత్రమే వుంటుంది. అన్నట్లు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసారు. ఫిబ్రవరి 17న విడుదలవుతుంది.

Show comments