ఈ డబ్బును చంద్రబాబు కాజేస్తాడో ఏమో?

కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంతో కొంత సాయం చేయడం ప్రారంబించిందని.. భవిష్యత్తులో మరిన్ని విడతలుగా ఇంకా కొంత సాయం రావచ్చునని ఏమాత్రం చంకలు గుద్దుకోవడానికి వీల్లేదు. ప్రత్యేకించి రాజధాని కోసం కేంద్రం విదిలించిన 450 కోట్ల సాయం చేతికి రాగానే ఏమైపోతుందో ఏమో అనే భయం ఇప్పటికే చాలా మందిలో వినిపిస్తోంది. ఈ డబ్బు విడుదల కాగానే చంద్రబాబు దానిని కాజేస్తారేమో అనే అనుమానాలు కూడా రాజకీయవర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. 

కాజేయడం అంటే ఇక్కడ అచ్చంగా చంద్రబాబు నాయుడు కేంద్రం ఇచ్చే డబ్బులను తన జేబులో వేసేసుకుంటారని అర్థం కాదు. ఆ డబ్బును ఏ ఖర్చులకోసమైతే కేంద్రం ఇచ్చిందో అందుకు ఖర్చు పెట్టకుండా.. బైపాస్‌ చేయడం అన్నమాట. చంద్రబాబు గతంలో చేసింది కూడా అదే. 

నిజానికి అమరావతిలో కోర్‌ క్యాపిటల్‌ లో రాజ్‌భవన్‌, అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియేట్‌ వంటి ప్రభుత్వ భవనాలను నిర్మించడం వరకు నిధులు ఇవ్వడం కేంద్రం బాద్యత. కేం ద్రం రాజధాని పేరు మీద ఇచ్చే నిదులను ఈ నిర్మాణాలకు మాత్రమే ఖర్చు చేయాలి. కానీ గతంలో కేంద్రంఇచ్చిన సొమ్ములను చంద్రబాబునాయుడు.. అమరావతి ప్రాంత రైతులకు రుణమాఫీ కింద చెల్లించేసి.. రాజధాని ఖర్చుల కింద పద్దు రాసేశారు. 

రాష్ట్రమంతా విడతలుగా రుణమాఫీని ప్రకటించిన చంద్రబాబునాయుడు.. అమరావతి ప్రాంత రైతులకు, భూములు రాజధానికోసం ఇచ్చిన వారికి మాత్రం ఒకేసారి మాఫీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్మాణాల కోసం ఇచ్చిన డబ్బును, ఇలా తన రాజకీయ హామీ మాఫీ కోసం ఖర్చు పెట్టేసి.. ఒక్క నిర్మాణం కూడా చేపట్టకుండా కేంద్రం మీద నిందలేస్తూ గడిపేస్తున్నారు.  Readmore!

అందుకే ఇన్నాళ్లూ ఇచ్చిన డబ్బుకు , పెట్టిన ఖర్చేమిటో లెక్కలు చెప్తే తప్ప ఇవ్వం అం టూ కేంద్రం మొండికేసింది. మొత్తానికి ఇప్పుడు మరో విడత విదిలించారు. రాజధాని నిర్మాణాల కోసం 450 కోట్లరూపాయలు ఇచ్చారు. నిజానికి ఈ సొమ్మును కోర్‌ కాపిటల్‌ లో పైన చెప్పిన నిర్మాణాలకు మాత్రమే ఖర్చు పెట్టాలి. ఆ డబ్బుతో కొన్ని నిర్మాణాలు రావచ్చు లేదా.. కనీసం ఆయా భవనాలకు సంబంధించి.. కొంత మేర పనులు ప్రారంభం కావచ్చు. 

కానీ చంద్రబాబు ఖర్చు పెడతారో.. లేదా... వాటిని ఇతరత్రా తన రాజకీయ అవసరాలు, హామీలకోసం వాడుకుని.. మా ప్రభుత్వం వద్ద డబ్బులేదు, పైసా లేకపోయినా రాజధాని కట్టడం కోసం ప్రపంచం మొత్తం తిరుగుతున్నా.. అంటూ తన నాటకీయ డైలాగులు వల్లిస్తారో వేచిచూడాలి. 

Show comments

Related Stories :