కరణం బలరామ్..ఇక అవుట్..?

ఈ రోజు పత్రికల వార్తలు ఇదేమాట చెబుతున్నట్లుగా వుంది. వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న వలసల పట్ల కరణం బలరామ్ అసంతృప్తిగా వున్న సంగతి తెలిసిందే. అయితే కొత్త విషయం ఏమిటంటే.. బాబుకు ఈ పాత బలరామ్ కన్నా కొత్తగా వచ్చిన వాళ్లే ఇష్టంగా వున్నారన్నది. అవును లెండి..కొత్తగా వచ్చిన వాళ్లు బలవంతులు కాబట్టేగా, వైకాపా నుంచి ఏదో విధంగా లాక్కొచ్చింది. 

మరి అలాంటి వాళ్లను ముద్దు చేయాలి కానీ, ఇక్కడున్న పాత ముఖాలను కాదు కదా.. పైగా ఇప్పుడు వీళ్లను ముద్దు చేసి, వాళ్లను ముద్దు చేస్తే, ఎన్నికల వేళకు టికెట్ ల సమస్యలు వస్తాయి. అదే ఇప్పటి నుంచీ పొగ పెడితే, వెళ్లాల్సిన వాళ్లు బయటకు వెళ్తారు. మిగిలిన వాళ్లకు టికెట్ ఇచ్చుకోవచ్చు.. ఇలా స్మూత్ గా జనాల్ని బయటకు పంపడం అన్నది బాబుకు తెలిసినంత బాగా మరెవరికీ తెలియదు. గతంలో ఎందరో హేమా హేమీలకు అనుభవమైంది ఈ విషయం.

Show comments