నాన్సెన్స్‌.. నా గ్లామర్.. నా ఇష్టం.!

'నేనొక మహిళను.. సెలబ్రిటీని.. గ్లామరస్‌ తారని కూడా.. గ్లామరస్‌గా కన్పించడం నా ఇష్టం.. నేనెలా డ్రెస్సింగ్‌ చేసుకోవాలో మీరెలా డిసైడ్‌ చేస్తారు.? నాన్సెన్స్.. నా గ్లామర్ నా ఇష్టం.. గ్లామరస్‌ యాంగిల్‌ని మాత్రమే చూడండి.. వల్గర్‌గా ఆలోచించొద్దు.. గ్రో అప్‌ కిడ్స్‌..' అంటూ బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌, తన డ్రెస్సింగ్‌ స్టైల్‌ గురించి మరోసారి క్లాస్‌ తీసుకుంది. 

ఈ మధ్యనే ఓ కవర్‌ పేజీ మీద దర్శనమిచ్చిన సోనమ్‌ కపూర్‌, మహిళలపై లైంగిక వేధింపులు - అత్యాచారాల గురించీ, ఈ క్రమంలో జరిగే చర్చల్లో మహిళల డ్రెస్సింగ్‌ గురించి వస్తున్న విమర్శలకు ఆ మ్యాగజైన్‌లో క్లారిటీ ఇవ్వడమే కాదు, చాంతాడంత క్లాస్‌ కూడా తీసుకుంది. పురుషుల మైండ్ సెట్ మార్చుకోవాలంటూ తనదైన స్టయిల్లో స్పందించింది. తాజాగా, మరోసారి తన 'గ్లామరస్‌ అవతార్‌'పై రచ్చ జరుగుతుండడంపై మండిపడిందీ బాలీవుడ్‌ భామ. 

సోనమ్‌ కపూర్‌ డ్రెస్సింగ్‌ గురించి పేర్కొంటూ, ఆ డ్రెస్సింగ్‌పై వస్తున్న విమర్శల్నీ కోట్‌ చేస్తూ బాలీవుడ్‌ మీడియా కథనాల్ని ప్రసారం చేయడంతో, ఆమె మరింత ఆగ్రహానికి గురయ్యింది. 'నా మీద ఎవరూ జాలి పడాల్సిన అవసరం లేదు.. నేనేమీ ఆ డ్రెస్సింగ్‌లో డిస్కంఫర్ట్‌ ఫీలవలేదు.. చాలా కంఫర్టబుల్‌గానే వున్నాను.. వల్గర్‌గా వున్నానని నాతో ఎవరూ చెప్పలేదు.. మీరెవరూ నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు..' అంటూ సోనమ్‌ కపూర్‌ సోషల్‌ మీడియాలో తనదైన స్టయిల్లో మండిపడింది. 

మరోపక్క, 'స్టైల్‌ ఐకాన్‌' అన్పించుకోవడం కోసం.. ఇన్నిన్ని 'దారుణాలు' చూపించెయ్యాలా.? పైగా, మీడియా మీద మండిపడాలా.? అనే కామెంట్స్, ఆమెకి సోషల్ మీడియాలోనే ఎదురవుతున్నాయనుకోండి.. అది వేరే విషయం.

Show comments