ష్యూర్.. మరెన్నో సర్జికల్ స్టైక్స్ అవసరముంది!


కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యంపై మరోసారి దాడి జరిగింది. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టుగా సైన్యం ప్రకటించింది. ఈ దాడిలో ఒక జవాను అమరుడు కాగా, మరో సైనికుడు గాయపడ్డాడని తెలుస్తోంది. ఉగ్రవాదులు గ్రనేడ్లు విసురుతూ ఉగ్రవాదులు మిలటరీ క్యాంప్ లోకి చొచ్చుకుపోయే  యత్నం చేశారని, ఆదివారం రాత్రి పదిన్నరకు ఈ సంఘటన జరిగిందని సైన్యం తెలిపింది. ఈ ఘటనలో ఐదారు మంది ఉగ్రవాదులు పాల్గొని ఉండవచ్చునని.. వారిలో ఇద్దరిని హతం చేసినట్టుగా ప్రకటించారు.

మరి కుక్కతోక బుద్ధి పాకిస్తాన్ ఈ ఘటన అనంతరం ఇస్తున్న సందేశం ఒక్కటే.. ఇంకా సర్జరీ అవసరం అని, మరిన్ని అటాక్స్ అవసరం అని. భారత సైన్యం భారీ స్థాయిలో నిర్వహించిన ఆపరేషన్ అనంతరం కూడా ఉగ్రవాద మూకలు ఏ మాత్రం భయపడటం లేదని స్పష్టం అవుతోంది. ఇంకా ఆ అంశంపై చర్చ జరుగుతుండగానే మళ్లీ ముష్కరులు రెచ్చిపోతున్నారు. ఒక జవాను ప్రాణాలు కోల్పోవడాన్ని చిన్న విషయంగా భావించడానికి వీల్లేదు.

ముప్పై నలభై మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం ద్వారా ఈ సమస్య పరిష్కారం అయ్యేదిలా కనిపించడం లేదు. జల్లెడ పట్టి ఏరి వేస్తే తప్ప అంతో ఇంతో ప్రశాంతత లభించకపోవచ్చు. 

రానున్నది శీతాకాలం.. అప్పుడు కాశ్మీర్ లో దట్టంగా ఆవరించే మంచుతో.. చొరబాట్లకు కూడా అవకాశం ఉండదు. అందుకే ప్రతియేటా అంతలోపే వీలైనంతమంది ఉగ్రవాదులు ఈ నెలల్లో చొరబాటుకు యత్నిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎల్వోసీలో పీవోకే వైపు ఉగ్రవాదుల కదలికలు స్పష్టంగా తెలుస్తాయని  సైన్యం చెబుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఘటనతో మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ ఉంటాయని ఆశిద్దాం. Readmore!

Show comments