సినిమా ప్రారంభించినపుడు హుషారుగానే వుంటుంది. కానీ తీరా బడ్జెట్ అంచనాలు దాటేస్తుంటే..నిర్మాతలకు కాస్త కష్టంగానే వుంటుంది. ఇప్పుడు షూటింగ్ లో వున్న ఓ యంగ్ హీరో సినిమాకు ఇలాగే జరిగిందని వార్తలు వినవస్తున్నాయి. రెండు హిట్ లు, ఓ ఫ్లాప్ ఇచ్చిన ఓ డైరక్టర్ చేస్తున్న ఈ సినిమా, వరుసఫ్లాప్ ల్లో వున్న ఆ హీరోకి చాలా చాలా అవసరం.
అలాగే ఆ దర్ళకుడికి కూడా ఈ సినిమా విజయం చాలా అవసరం. దీనికి ముందు ఫ్లాప్ రావడంతో కాస్త గ్యాప్ వచ్చింది కాబట్టి..అందుకే వీరభద్రావతారం ఎత్తేసి, కాస్త భారీ స్టార్ కాస్ట్..కాస్త లావిష్ చిత్రీకరణ పై దృష్టి పెట్టారు. విదేశాల్లో పాటలు, విదేశీ ముద్దుగుమ్మలు..ఇలా. దీంతో బడ్జెట్ ఏడు కోట్లకు వెళ్లిపోయిందని తెలుస్తోంది.
దాంతో నిర్మాతలు ఇక చాలు బాబూ.. మిగిలిన మూడు పాటలు వద్దు కానీ, ఒక్కదానితో సరిపెట్టేయమన్నారని వార్తలు గుప్పుమన్నాయి. అలా కాదు..ఇంత వరకు వచ్చాక.. కాస్త లాగేయండి అని నచ్చ చెప్పి, ఒక పాటను కట్ ను ప్లాన్ నుంచి కట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా రెండు పాటలు వున్నాయి..అవి కానిస్తారో..మరోటి తెగ్గోస్తారో చూడాలి.