శ్రీనగర్ కాలనీపై సినీ జనాల కన్ను

హైదరాబాద్ హార్ట్ గా చెప్పుకునే శ్రీనగర్ కాలనీ అంటే సినిమా జనాలకు చిరునామా. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ తరువాత శ్రీనగర్ కాలనీకి అంతటి డిమాండ్ వుంది. చాలా మంది నటులు, దర్శకులకు ఇక్కడ ఇళ్లు వున్నాయి. అలాగే చాలా సినిమా ఆఫీసులు వున్నాయి ఇక్కడ. ఇటీవల ఈ కాలనీ క్రేజ్ మరింత పెరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నే ఇక్కడ ఓ అసెట్ ఆ మధ్య కొనుగోలు చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే హీరో కళ్యాణ్ రామ్ తరపునో, మరి నేరుగానో ఆయన బంధువు ఒకరు రెండు ఆస్తులు శ్రీనగర్ కాలనీలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఒక యంగ్ హీరో కూడా ఇక్కడ పాష్ అపార్ట్ మెంట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కు ఇటు పంజాగుట్ట, అమీర్ పేట లాంటి వాణిజ్య ఏరియాలకు మధ్యన వుండడం వల్ల శ్రీనగర్ కాలనీలో కొనుగోళ్లకు సినిమా సెలబ్రిటీలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Readmore!
Show comments