తెలుగులో బ్రాండ్ అంబాసిడర్లగా వుండే హీరోల్లో లీడింగ్ ఎవరంటే మహేష్ బాబే. అందులో సందేహం లేదు. మహేష్ బాబు ఖాతాలో మరో కంపెనీ చేరింది. ఎయిర్ కండిషన్లు, ఇతర గృహోపకరణాలు అందించే లాయిడ్ కంపెనీ ఆంధ్ర, తెలంగాణ లకు తమ ప్రొడక్ట్ ప్రమోషన్ కు గాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఎన్ని కోట్లకు ఈ ఒప్పందం కుదిరిందన్నది చెప్పడం లేదు కాదు కానీ, ఇకపై థమ్స్ అప్ ఇతరత్రా ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్న మాదిరిగానే మహేష్ బాబు లాయిడ్ ఎసి లు, టీవీలు, ఇతరత్రా ఉత్పత్తులు కొనమని రికమెండ్ చేస్తారు. అయితే గ్లామరస్, క్రేజీ ఏక్టర్లు ప్రమోట్ చేసినంత మాత్రాన జనం కొనేసే రోజులు ఎప్పుడోపోయాయి. ఎటొచ్చీ బ్రాండ్ పేరు కాస్త బలంగా జనంలోకి వెళ్తుంది.
ఈ మేరకు కొన్ని కోట్లు సెలబ్రిటీల ఖాతాలోకి వెళ్తాయి. మహేష్ బాబు ఎంత చెప్పినా, అమరావతి లోని భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ఒకటి పెద్దగా క్లిక్ కాలేదని టాక్. ఈ సమ్మర్ లో లాయిడ్ ఏ మేరకు మహేష్ బాబు క్రేజ్ ను వాడుకుని ఎసి లు అమ్ముకుంటుందో చూడాలి మరి.
-సాయి