స్మైలింగ్ టేబుల్.. అంటూ పైన చూస్తున్న ఫొటోకి సంబంధించిన వీడియో ఒకటి విడుదల చేసింది 'హార్ట్ ఎటాక్' బ్యూటీ ఆదా శర్మ. అందరికీ తెల్సిన విషయమే ఆదా శర్మకి జిమ్నాస్టిక్స్‌లో మంచి ప్రావీణ్యం వుందని. తల్లి ద్వారా జిమ్నాస్టిక్స్ నేర్చుకున్న ఆదా శర్మ, చాలా తేలిగ్గానే ఈ ఫొటోకి పోజిచ్చేసిందనుకుంటే అది పొరపాటే. దీనికోసం చాలా చాలా కష్టపడిందట.
ఈ ఫొటో కహానీ ఏంటంటే, ముందుగా ఈ భంగిమ కోసం చాలా డిస్కషన్ జరిగిందట. ఎంత సేపు ఆ భంగిమలో వుండగలదన్న విషయమ్మీద ఒకటికి పదిసార్లు టీమ్ అంతా చర్చించుకుని, ఆ తర్వాత ఓ అవగాహనకు వచ్చి, షూట్ చేశారట. ఎంత ప్లాన్డ్‌గా చేసినా, పెర్‌ఫెక్షన్ కోసం ఒకటికి పదిసార్లు సెటప్ అంతా జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చిందని అంటోంది ఆదా శర్మ.
ఎలాగైతేనేం, కొన్ని టేక్‌లు తీసుకున్నాసరే, భంగిమ చాలా పెర్‌ఫెక్ట్‌గా వచ్చిందనీ, దాంతో స్టిల్ చాలా చాలా బాగా వచ్చిందనీ ఆదా శర్మ అంటోంది. తనకు సంబంధించినంతవరకు ఇది బెస్ట్ ఎవర్ ఫొటో అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఫొటో ఎప్పుడో వైరల్ అయిపోయింది. ఇప్పుడా ఫొటోకి సంబంధించిన వీడియో మరింత వైరల్ కానుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!