సూయ.. సూయ.. అనసూయ.!

సాయిధరమ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'విన్నర్‌' సినిమాలో బుల్లితెర బ్యూటీ అనసూయ ఐటమ్‌ సాంగ్‌ చేస్తోన్న విషయం విదితమే. 'సూయ..సూయ..' అంటూ సాగే ఆ ఐటమ్‌ సాంగ్‌ ఆడియో సింగిల్‌ ఈ రోజే విడుదల కానుంది. 'కొలవరి' కుర్రాడు అనిరుధ్‌ ఈ సాంగ్‌ని తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా విడుదల చేయనున్నాడు. 

'విన్నర్‌' సినిమాలో తొలి సాంగ్‌ని మహేష్‌బాబు విడుదల చేయగా, రెండో సాంగ్‌ని సమంత విడుదల చేసిన విషయం విదితమే. ఇప్పుడు మూడో సాంగ్‌, అనిరుద్‌ విడుదల చేస్తాడు. ఈ రోజు సాయంత్రమే ఈ సాంగ్‌ విడుదల కానుంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్‌ హీరోగా నటిస్తున్న 'విన్నర్‌'లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఇక, అనసూయ ఐటమ్‌ సాంగ్‌ విషయానికొస్తే, ఎప్పుడో 'అత్తారింటికి దారేది' సినిమాలోనే ఆమెకు 'ఐటమ్‌' ఆఫర్‌ వచ్చింది. కానీ, ఆమె దాన్ని తిరస్కరించింది. అప్పట్లో అదో పెద్ద రచ్చ అయ్యింది. అఫ్‌కోర్స్‌, అనసూయ.. 'సోగ్గాడే చిన్న నాయనా' సినిమాలో చేసిందీ ఐటమ్‌ సాంగేననుకోండి.. అది వేరే విషయం. ఇప్పుడిలా 'విన్నర్‌' సినిమాలోనూ ఐటమ్‌ సాంగ్‌ చేసేసింది అనసూయ. ఈ సినిమా హైలైట్స్‌లో ఇదీ ఒకటని చిత్ర యూనిట్‌ చెబుతోంది. అన్నట్టు, తాను చేసింది ఐటమ్‌ సాంగ్‌ కాదనీ, అది స్పెషల్‌ సాంగ్‌ అనీ అనసూయ చెబుతున్నా.. పేరేదైతేనేం.. అదో 'హాట్‌ సాంగ్‌' అన్నది నిర్వివాదాంశం. 

Show comments