ఇదీ ‘తెలుగు’ మీడియా అసలు రూపం!

అప్పుడే మొదలు పెట్టేసింది తెలుగు మీడియా.. తెలుగుదేశం మీడియా! ఈ నెల 26 వ తేదీన విశాఖలో విపక్షాలు, హోదా ఉద్యమకారులు, యువతరం చేపట్టాలని భావిస్తున్న ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తొక్కేయడానికి శతథా ప్రయత్నిస్తోంది ఈ మీడియా వర్గం. ఈ రోజు ఏపీ ఎడిషన్ ను అంతా పరిశీలించి చూసినా.. ఎక్కడా ఈ వ్యవహారం గురించి అణువంతైనా స్థానం ఇవ్వకుండా యథారీతిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రక్షించడానికి ఈ మీడియా కంకణం కట్టుకుని పని చేస్తోంది.

ఇప్పటికే అనేక మంది విశాఖలో దీక్ష, ధర్నాకు మద్దతును ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి యువతరం పోస్టులతో రెడీ అయిపోయింది. పార్టీలకు అతీతంగా యువతలో హోదా పట్ల ఆకాంక్ష కనిపిస్తోంది. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తి ఏపీ యువతపై గట్టిగానే కనిపిస్తోంది. అయితే.. ఈ ఉద్యమం పట్ల ఇప్పటికే చంద్రన్న ఆగ్రహావేశాలు ప్రకటించేశారు.

 హోదా కోసం పోరాడటం తగదని బాబు స్పష్టం చేశాడు. ఈ విషయంలో ఆయన ఎంత అసహనాన్ని వ్యక్తం చేశాడో.. అంతా వ్యక్తం చేసేశాడు. పనిలో పనిగాప్యాకేజీకి చట్టబద్ధతను తెరపైకి తెచ్చేశారు! మరి బాబుగారి మనసు ఎరిగిన మీడియా.. అప్పుడే యువత ఉత్సాహంగా ఉన్న పోరాటాన్ని తక్కువ చేసి చూపించే యత్నం చేస్తోంది. అసలు అది ఒకటి ఉందన్న విషయాన్ని కూడా ప్రస్తావించడం లేదు!

ఆఖరికి ఆ కార్యక్రమాన్ని వైకాపా కొవ్వుత్తుల ర్యాలీ గా అభివర్ణించేసి.. ప్యాకేజీకి చట్టబద్దతను పతాక శీర్షికల్లోకి ఎక్కించేసి.. తన బాధ్యతను చాటుకుంది.  మరి ఇదీ తెలుగుదేశం మీడియా అసలు రూపం!   Readmore!

Show comments