నాని పాటను వాడేస్తున్నారు

నేను లోకల్ లో నెక్ట్స్ ఏంటీ? అన్న పాట సూపర్ పాపులర్. ఈ పాట లైన్ ను సినిమా టైటిల్ కు వాడేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్, యువి, బన్నీ వాసు కలిపి స్టార్ట్ చేసిన కొత్త సంస్థ వి4 బ్యానర్ పై నిర్మిస్తున్న సినిమాకు నెక్ట్స్ ఏంటీ? అన్న టైటిల్ ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

టీవీ ద్వారా పాపులర్ అయిన ప్రభాకర్ దర్శకత్వం వహించిన సినిమాలో ఆది సాయికుమార్, రేష్మి తదితులు నటించిన ఈ సినిమాకు యామిరిక్కు భయమే అనే తమిళ హర్రర్ కామెడీ సినిమా ఆధారం.

రోజుకో సంఘటన జరుగుతూ వుంటుంది లాడ్జిలో. అందువల్ల నెక్ట్స్ ఏంటీ? అన్న టైటిల్ ఏప్ట్ గానే వుంటుంది అని అనుకుంటున్నారు.

ఇదిలా వుంటే, ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే ఫ్రభాకర్ కు మరో సినిమా కూడా చేతిలోకి వచ్చేయడం విశేషం. ఒక కన్నడ నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తూ, దర్శకుడు మారుతి నిర్మించే సినిమాకు కూడా ప్రభాకరే దర్శకుడిగా ఎంపికయ్యాడని తెలుస్తోంది.

Show comments