గుసగుసలు : సాయి ప్రతాప్ కే రాజంపేట…

సాయి ప్రతాప్ కే రాజంపేట…

వచ్చే ఎన్నికల్లో సాయి ప్రతాప్ కే  రాజంపేట సీటు ఇస్తానని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇవ్వడంతో సాయిప్రతాప్ ఇప్పటినుంచే నియోజకవర్గంలో జనంతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఆరుసార్లు కాంగ్రెస్ నుంచి గెలిచి, కేంద్రమంత్రిగా పనిచేసినప్పటికీ వైసీపీ ఆయనను ఆదరించకపోవడంతో తెలుగుదేశంలో చేరక తప్పలేదు. చంద్రబాబు నిర్వహిస్తున్న స్వచ్చాంధ్ర ప్రచారంలో సాయిప్రతాప్ చురుకుగా పాల్గొన్నారు. దోమలపై దండయాత్రను నిర్వహించారు. సాయిప్రతాప్ రాజంపేటలో చంద్రబాబుకు ఉపయోగపడతారనడంలో సందేహం లేదు

హరీశ్ పబ్లిసిటీ…
రాష్ర్టమంత్రి హరీశ్ రావు స్వంతంగా పబ్లిసిటీ కార్యక్రమాన్ని ఉధతం చేశారు. కేసీఆర్ తలచిన కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయకపోతే తనకు మనుగడలేదని భావిస్తున్న హరీశ్  రావు ప్రతి కార్యక్రమాన్నీ విజయవంతం చేయడమేకాక తనకు తాను పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఆయన అభిమానులు ఆయననొక ప్రత్యమ్నాయ నేతగా ప్రచారం చేస్తున్నారు. పాటలు కడుతున్నారు. నగదు రహిత గ్రామం విషయంలో హరీశ్ రావే ముందంజలో ఉన్నారు. మునిసిపల్ మంత్రి అయిన ెకేసీఆర్ నగరంలో నగదు రహిత వ్యవస్థ విషయంలో ఏమి చేయలేకపోయినా హరీశ్రావు ఒక కుగ్రామాన్ని నగదు రహిత గ్రామంగా మార్చుకున్నారు. జాతీయ స్థాయి పత్రికలతో కూడా ఈ విషయాన్ని ప్రచారం చేయించుకుంటున్నారు. మోడీ దష్టిలో పడాలని ఆయన తాపత్రయమేమో..
 
వెంకయ్య ఆకలి…
అందరికీ తినడానికి ఆకలి వేస్తుంది. సమయం దాటిందంటే ఆవురావురుమంటారు. కాని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు మాత్రం ఒకగంట మాట్లాడకపోతే ఆవురావురుమంటుంది. ఏదో వంక దొరికించుకుని ప్రసంగించాలని ఆయన తహతహలాడుతుంటారు. మీడియా కనిపిస్తే చాలు విజంభిస్తారు. అధికారులు కనపడితే చాలు ప్రసంగాలు చేస్తుంటారు. చివరకు సిబ్బందికి కూడా పాఠాలు తప్పవు. రోజుకు కనీసం మూడు నాలుగు ప్రసంగాలు చేయకపోతే, తెల్లారి అన్ని పేపర్లు చూడకపోతే ఆయన మనసు మనసులో ఉండదు. కనీసం 32 పేపర్లు చదువుతారాయన. ఏదైనా పేపర్లో తన ఫోటో కాని, తన వార్త కాని లేకపోతే ఆయన మనసులో పడుతుంది. ఏ ఏ ఛానెల్లో ఎలా కవర్ చేస్తారో కూడా తెలుసుకుంటారు. ఆ పేపర్, ఛానెల్ విలేకరి కానీ, యజమాని కానీ కనపడితే చాలు వెంకయ్య ఫలానా న్యూస్ రాలేదనో, తప్పుగా వచ్చిందనో క్లాసు పీకుతారు. ఎంతైనా సమాచార మంత్రి కదా.. సమాచారం ఆయన వద్ద పక్కగా ఉంటుంది.  
 
రాహుల్ను ప్రసన్నం చేసుకోవడం ఎలా?
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ప్రసన్న చేసుకోవచ్చేమో కాని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మాత్రం ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదు. అసలు ఆయన దొరకడమే కష్టం అయితే దొరికిన తర్వాత ఆయన మెప్పు పొందడం అంతకష్టం. పైగా ముళ్లమీద కూర్చున్నట్లు కూర్చుంటారు. అందువల్ల ఏపీ, తెలంగాణ నేతలు రాహుల్ గాంధీని కలుసుకోని ప్రసన్నం చేసే విషయమై రకరకాల అధ్యయనం చేస్తున్నారు. రాహుల్ను మెప్పించడం ఎలా అన్న విషయంపై పార్టీ నేతల్ని అడుగుతారు. దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ లాంటి నేతలేక సాధ్యం కాని విషయం మన రాష్ర్ట నేతలకు ఎలా సాధ్యపడుతుంది?

Readmore!
Show comments