మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్

విడుదల ఇంకో మూడు రోజుల్లో వుందనగా ఖైదీ నెంబర్ 150 ట్రయిలర్ జనం ముందుకు వచ్చింది. చిరంజీవి సినిమా హిట్ ఫార్ములా అంటూ ఒకటి డిజైన్ చేసుకుంటే, ఆ ఫార్ములను తు చ తప్పకుండా ఫాలో అయిపోయినట్లు వుందీ ట్రయిలర్.

ఈ ట్రయిలర్ లో హైలైట్ ఏమిటీ అంటే..మెగాస్టార్ నే. అరవై ఒక్క ఏళ్ల వయసులో, ఆయన కనీసం ఇరవై ఏళ్లకు పైగా తగ్గినట్లు కనిపించారు. అదే అన్ని విధాలా ఈ ట్రయిలర్ కు పెద్ద అట్రాక్షన్.

149 సినిమాల చిరు అనుభవంలో తెలుసుకున్న హిట్ ఫార్ములా ప్రకారం పేర్చుకున్న సీన్లు అన్నీ అలా అలా ట్రయిలర్ లో మెరిసాయి. డ్యాన్స్ లు, ఫైట్లు, ఎమోషన్ సీన్లు, డైలాగ్ సీన్లు, ఇలా అన్నీ తూకం వేసి పేర్చుకున్నట్లు కనిపిస్తుందీ ట్రయిలర్. 

ఈ ట్రయిలర్ మొత్తం మీద ఫ్యాన్స్ కు మాత్రం ఫుల్ మీల్సే..అందులో సందేహం లేదు.

Show comments