ఈ సారైనా ఛాన్స్ ఇస్తావా చెర్రీ

అనుపమ పరమేశ్వరన్ కు రామ్ చరణ్ సినిమాలో ఇలా ఛాన్స్ వచ్చి అలా మిస్ అయిపోయింది. సినిమా ముహూర్తం షాట్ వరకు అనుపమే హీరోయిన్ అని అంతా అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఆమె స్థానంలో సమంతను హీరోయిన్ గా తీసుకున్నారు. భారీ పారితోషికం డిమాండ్ చేయడం వల్లనే అనుపమను తప్పించారనే వార్తల్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తోసిపుచ్చినప్పటికీ... అసలు ఆమెను తప్పించడానికి మెయిన్ రీజన్ ఏంటనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉండగా, చెర్రీ ఇప్పుడు ఇంకో సినిమా లైన్లో పెట్టాడు. మరి ఈసారైనా అనుపమకు ఛాన్స్ ఇస్తాడా అని అంతా ఎదురుచూస్తున్నారు.

త్వరలోనే మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు చరణ్. ఈ సినిమాలో అనుపమకు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఛాయిస్ చరణ్ చేతిలో లేదు. తన సినిమాకు కథ ప్రకారం ఏ హీరోయిన్ సూట్ అవుతుందో స్వయంగా మణిరత్నమే నిర్ణయిస్తాడు. కావాలంటే అనుపమ పేరును పరిశీలించమని చెర్రీ చెప్పొచ్చు. అయితే ఇక్కడ కూడా అనుపమకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. 

మణిరత్నం సినిమా అంటే కచ్చితంగా అది తెలుగు-తమిళ భాషల్లో విడుదలవుతుంది. సో.. టాలీవుడ్, కోలీవుడ్ కు కనెక్ట్ అయ్యే హీరోయిన్ ను తీసుకుంటారు. కోలీవుడ్ లో అనుపమకు అంత సీన్ లేదు. సో.. ఏదో మేజిక్ జరిగితే తప్ప మణిరత్నం-చరణ్ సినిమాలో కూడా అనుపమకు ఛాన్స్ కష్టమే.

Show comments