రవితేజ అక్కడి నుంచి దిగిరాడా?

కొందరంతే.. తమ మార్కెట్ ఇప్పుడెలా వుంది.. తమ జమానా ఇంకా నడుస్తోందా..లేదా.. ఇవన్నీ పట్టవు. అప్పుడెప్పుడో తమ డిమాండ్ పీక్స్ లో వున్నపుడు తీసుకున్న రెమ్యూనిరేషన్ నే ఇప్పుడూ కావాలంటారు. అలాంటి వారిలో హీరో రవితేజ అందరికన్నా ముందు వుంటాడన్నది టాలీవుడ్ గుసగుసల సారాంశం. బెంగాల్ టైగర్ తరువాత ఇంత వరకు రవితేజ సినిమా పట్టాలు ఎక్కలేదు. నిర్మాత దిల్ రాజుతో సినిమా అనుకున్నారు. కానీ క్యాన్సిల్ అయింది. కారణం రెమ్యూనిరేషన్ నే. డిస్కషన్ లో ఓకె అన్నట్లే అనేసి, ఇంటికెళ్తూనే ఫోన్ చేసి, సారీ చెప్పేసాడట రవితేజ. సో అది అలా ఆగిపోయింది.

రంజిత్ మూవీస్ దాము గారితో సినిమా అనుకున్నారు. వాళ్లు కూడా రవితేజ రెమ్యూనిరేషన్ 9 కోట్లు, సినిమాకు ఆ రేంజ్ డైరక్టర్ ను పెడితే, అతగాడి రెమ్యూనిరేషన్, మిగిలిన స్టార్ కాస్ట్, ప్రొడక్షన్ ఎక్స్ పెండిచర్ అంతా లెక్కలు వేసుకుని వెనక్కు తగ్గేసారు. ఎందుకంటే 28 నుంచి ముఫై కోట్లు ఖర్చు అవుతోంది. ఇరవై నుంచి పాతిక కోట్ల మార్కెట్ వుంది. మరి ఎలా పాజిబుల్ అవుతుంది. 

ఇప్పుడు చక్రి, బాబీ ఇద్లరు డైరక్టర్లను దగ్గర పెట్టుకుని, నిర్మాతల కోసం చూస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ తోమ్మది కోట్లకు పైసా తగ్గనన్నది కండిషన్ గా టాక్ వినిపిస్తోంది. దీంతో రవితేజకు సూటయ్యే మాంచి సబ్జెక్ట్ లు దగ్గరున్న నిర్మాతలు కూడా అటు చూడడానికి జంకుతున్నారని వినికిడి.

Show comments