హీరోయిన్.. స్విమ్ సూట్ సెలబ్రేషన్స్..!

ఒక్కో రోజు ఒక్కో విధంగా.. ఇన్ స్టాగ్రమ్ ను హీటెక్కిస్తోంది ఇలియానా. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి విహారాలను, అతడితో రొమాన్స్ ను ఫొటోల, వీడియోల రూపంలో పోస్టు చేస్తూ వస్తోంది ఈమె. ఇంకేముంది.. ఇలా వరసగా అందాల విందును ఇస్తున్న నేపథ్యంలో ఆమె ఇన్ స్టాగ్రమ్ అకౌంట్ కు ఫాలోయర్ల తాకిడి పెరుగుతూ పోతోంది.

తాజాగా అది నాలుగు మిలియన్ల మార్కును రీచ్ అయ్యింది! ఇన్ స్టాగ్రమ్ లో ఇలియానాకు నలభై లక్షల మంది ఫాలోయర్లుగా మారారు! ఈ సందర్భాన్ని కూడా తనదైన రీతిలో సెలబ్రేట్ చేసింది ఇలియానా!

ఇది వరకూ ఒకసారి స్విమ్మింగ్ వీడియోను పోస్టు చేసిన ఈ గోవా భామ.. ఫాలోయర్ల సంఖ్య నలభై లక్షలను చేరిన నేపథ్యంలో కూడా అలాంటి వీడియోనే పోస్టు చేసింది. స్మిమ్ చేస్తూ.. అందరికీ ‘హాయ్..’ చెబుతూ అందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది ఇలియానా!  ఇంకేముంది లక్షల మంది గుండెల్లో అలజడే!

Readmore!
Show comments

Related Stories :