చెర్రీ - సుకుమార్ వెనక్కు వెళ్తున్నారు

సమ్ థింగ్ స్పెషల్ లేకుండా దర్శకుడు సుకుమార్ సినిమా చేయరు. అది ప్రూవ్ అయింది చాలాసార్లు ఇఫ్పటికే. ఆయన డైరక్ట్ చేసినా, సినిమా నిర్మాణం చేసినా. సుకుమార్ త్వరలో మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. మైత్రీ మూవీస్-రామ్ చరణ్ కాంబినేషన్ లో. ఈ సినిమా కోసం ఆయన ఓ లవ్ స్టోరీ రెడీ చేసారని ఇప్పటికే వార్తలు వినవచ్చాయి. 

ఈ సినిమాకు సుకుమార్ సుమారు పాతికేళ్లకు పైగానే వెనక్కు వెళ్తున్నారన్నది లేటెస్ట్ సమాచారం. అంటే, రఫ్ గా చెప్పుకోవాలంటే 1980 ఆ టైమ్ కు అన్నమాట. అప్పట్లో జరిగిన ఓ లవ్ స్టోరీ అన్నమాట. అంటే ఒక విధంగా సెల్ ఫోన్ లు, డిజిటిల్ రివల్యూషన్ లేని కాలంలోని లవ్ స్టోరీ అనుకోవాలి. 

ఈ పీరియడ్ లవ్ స్టోరీ మూవీ కోసం సుకుమార్ చాలా కసరత్తులే చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి సుకుమార్ స్టయిల్ లో 1980 పిరియల్ లవ్ ఎలా వుంటుందో..జనాలకు కాస్త ఆసక్తే మరి.

Readmore!
Show comments

Related Stories :