అయ్యో..పవన్ కు స్పాన్సర్ లేరు

జనసేన మీటింగ్ అంటే ఎలా వుండాలి. కనీసం హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ వుండాలి. లేదా కాస్త ఫైవ్ స్టార్ హోటల్ అన్నా వుండాలి. అలాంటిది తిరుపతిలో పాపం, ఓ మైదానంలో సభ జరపాల్సి వచ్చింది. దీనికి కారణం ఏమిటి? ఈసారి పివిపి లాంటి స్పాన్సర్ లేకపోవడమే. జనసేన ఆరంభంలో అంటే పాపం, పివిపి చాలా ఖర్చు చేసారు. జనసేన కోసం విజయవాడ లాంటి చోట్ల ఆఫీసులు, హైదరాబాద్, విశాఖ లాంటి చోట్ల పవన్ సభలకు భారీగా ఖర్చుచేసారు. 

తరువాత పాపం, పివిపికి పవన్ సంగతి ఆయన ఏంగిల్ లో ఆయనకు తెలిసి వచ్చింది. దూరమయ్యారు. ఇప్పుడు స్పాన్సర్ లేరు. బహుశా అందుకే కావచ్చు, తొలిసారి జనసేన సభ ఓ సాదా సీదా మైదానంలో జరుగుతోంది. అయినా ఫరవాలేదు. ఇప్పుడు కనుక పవన్ తన రాజకీయ కార్యాచరణ పక్కాగా ప్రకటిస్తే, మళ్లీ ఎవరో ఒక స్పానర్ దొరుకుతారు. 

ఒకరేం ఖర్మ జిల్లాకు ఒకరు వంతున ముందుకు వస్తారు. ప్రజారాజ్యం ప్రారంభంలో పాపం బోలెడు మంది ఎన్నారైలు ఇలాగే వచ్చి, జేబులు గుల్ల చేసుకుని, టికెట్ లు దొరక్క తిట్టుకుంటూ వెనక్కు పోయారు. మళ్లీ మరో ఎపిసోడ్ ఇప్పుడు ప్రారంభమైంది అనుకోవాలి. 

Show comments